Bro Collections: రెండు రోజుల్లో రూ.75 కోట్లు రాబట్టిన బ్రో..
బాక్సాపీస్ వద్ద బ్రో సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బ్రో మూవీ విడుదలైన తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.48 కోట్లు పైగా గ్రాస్ వసూలు చేసింది. బ్రో చిత్రం నైజాం ఏరియాలోనే 14 కోట్లు రాబట్టింది. ఈస్ట్, వెస్ట్ లో ఐదు కోట్లు, ఉత్తర ఆంధ్ర, గుంటూరు రెండున్నర కోట్ల చొప్పున వసూలు చేసింది. మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించినఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారీ వర్షాల నేపథ్యంలో ఈ సినిమాకు ఆదారణ అంతంతే ఉంటుందని అందురూ భావించారు. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చింది.ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ మూలీ రెండో రోజు కూడా అదే రేంజ్ లో డబ్బులు వసూలు చేసింది. మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 35.24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది.

ఈ సినిమా రెండో ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక మొత్తంగా రెండు రోజుల్లో రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.మూడో రోజు పూర్తి అయ్యేసారికి సినిమా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. పవన్ సినిమాకు భారీగా కలెక్షన్లు రావడంతో పవన్ ఫ్యాన్స్ కుషి అవుతున్నారు. తమిళ మూవీ సిత్తం ఆధారంగా బ్రో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సుబ్బరాజు, అభిమన్యు సింగ్, ముకుల్ దేవ్, అశుతోష్ రాణా, వెన్నెల కిషోర్, అలీ రెజా, తదితరులు నటించారు. రోహిణి, తనికెళ్ల భరణి, సమీర్‌హాసన్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా 'మై డియర్ మార్కండేయ'లో సిత్ర మంజరిగా డ్యాన్స్‌లో అలరించారు. ఈ చిత్రానికి రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. ZEE స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కింద టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్నినిర్మించారు.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications