జీహెచ్‌ఎంసీ మేయర్‌పై బీఆర్‌ఎస్‌ అవిశ్వాసం - నెగ్గేనా, లెక్క క్లియర్..!!

గ్రేటర్ లో రాజకీయ ఆసక్తి కరంగా మారుతోంది. గ్రేటర్ ఎన్నికల పైన అంచనాలు మొదల య్యాయి. ఈ సమయంలోనే బీఆర్ఎస్ జీహెచ్‌ఎంసీ మేయర్‌పై బీఆర్‌ఎస్‌ అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమవుతోంది. ప్రభుత్వం అవిశ్వాసం పై తీసుకొచ్చిన చట్ట సవరణతో.. ఫిబ్రవరి 10 తరువాత అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం దక్కుతుంది. ఈ అవిశ్వాసం వేళ జీహెచ్‌ఎంసీ లో ప్రస్తుతం పార్టీల బలాబలాలు ఫలితం ఏంటనేది స్పష్టం చేస్తున్నాయి.

బీఆర్ఎస్ కసరత్తు
జీహెచ్‌ఎంసీ మేయర్‌పై బీఆర్‌ఎస్‌ అవిశ్వాసం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరియు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిల పై అవిశ్వాసానికి సిద్దం అవుతోంది. తాజాగా గ్రేటర్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమయంలో జరిగిన చర్చలో అవిశ్వాసం పై చర్చకు వచ్చింది. కాగా, ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణతో నాలుగేళ్ల వరకు అవిశ్వాసం ప్రతిపాదించేందుకు అవకాశం లేదు. కానీ, జీహెచ్ఎంసీ కౌన్సిల్ నాలుగేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 11న ముగుస్తుంది, తద్వారా తీర్మానంపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది.

BRS decided to move a no-confidence motion against GHMC Mayor Gadwal Vijayalakshmi

సంఖ్యా బలం
బీఆర్ఎస్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి, జీహెచ్ఎంసీ 196 సభ్యులలో 50% మద్దతు అవసరం. ఈ తీర్మానానికి 98 మంది సభ్యుల సంతకం అవసరం. తరువాత, ఈ తీర్మానాన్ని హైదరాబాద్ కలెక్టర్ కు సమర్పించి, ఆ తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే, మేయర్ మరియు డిప్యూటీ మేయర్ వెంటనే రాజీనామా చేయాలి. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మందికి గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరికితోడు 50 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిపి కౌన్సిల్‌లో196 మంది సభ్యులున్నారు. వీరిలో 131 మంది మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గేందుకు సంఖ్య బలం కావాలి.

ఎంఐఎం మద్దతు దక్కేనా
ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 42 కార్పొరేటర్లు, 11 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ ఎంపీలతో కలిపి 62 సభ్యుల బలం ఉంది. ఇటు కాంగ్రెస్ కు కొంత కాలంగా ఎంఐఎం తో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నాయి. బీఆర్ఎస్ అవిశ్వాసం ప్రతిపాదిస్తే ఎంఐఎం మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే, ఎంఐఎం కాంగ్రెస్ తో జత కట్టిన విషయాన్ని అధికారికంగా నిరూపించేందుకు ఈ అవిశ్వాసం కలిసి వస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఇటు బీజేపీ సైతం అవిశ్వాసానికి మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో గ్రేటర్ పాలక వర్గ సమయం .. ఇతర సాంకేతిక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో, గ్రేటర్ మేయర్ పైన అవిశ్వాసం అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+