ఆ భయంతోనే.: కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై సంజయ్ రౌత్ సంచలనం
ముంబై/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు గత పాలకులపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రస్తుత మహారాష్ట్ర పర్యటనపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నేత, ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు ఎక్కుపెట్టారు.
మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏ మాత్రం ఉండబోదని, ఇలాగే డ్రామాలాడితే తెలంగాణలోనే ఓడిపోతారని సంజయ్ రౌత్ అన్నారు. తెలంగాణలో ఓటమి భయంతోనే మహారాష్ట్రకి వస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరారని.. ఇది కాంగ్రెస్, కేసీఆర్ మధ్య జరుగుతున్న పోరు మాత్రమేనని అన్నారు.

తెలంగాణలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై మహారాష్ట్రలో ప్రతీకారం తీర్చుకుందామని భావిస్తే.. మీరు బీజేపీకి పనిచేస్తున్నట్లే అర్థమవుతుందని కేసీఆర్ ను ఉద్దేశించి సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని.. బీజేపీనే కేసీఆర్‌ను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తోందన్నారు రౌత్. అయితే, ఇక్కడ మహా వికాస్ అఘాడీ బలంగా ఉంది. మహారాష్ట్రలో ఎంత బలం ప్రదర్శిస్తారో.. తెలంగాణలో అంత బలహీనపడతారని, అధికారంలో కోల్పోతారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌కు పోరాట నేతగా పేరుంది.. కానీ, ఎందుకు బీజేపీకి లొంగిపోతున్నారని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఆలయాల సందర్శన వెనుక ఆంతర్యమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ఏదేమైనా.. ఈ వ్యవహారంపైనా చర్చలు జరుపుతామన్నారు సంజయ్ రౌత్. కాగా, ఇప్పటికే ఎన్సీపీ నేతలు కూడా కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ మహారాష్ట్రకు వస్తే.. తాము తెలంగాణలోకి వచ్చి పోటీ చేస్తామన్నారు.
కాగా, సీఎం కేసీఆర్ సోమవారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి రెండు ప్రత్యేక బస్సులు, 600కుపైగా వాహనాలతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్లిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. మంగళవారం పండరీపూర్‌లోని విఠల్ రుక్మిణి దేవస్థానాన్ని సందర్శించారు. ఆ తర్వాత సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మహారాష్ట్ర పాలకులపై విమర్శలు గుప్పించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications