Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కొండా సురేఖకు అవమానం

Balka Suman: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఈ ఆలయానికి రావడం ఇదే తొలిసారి.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రేవంత్ రెడ్డి, మంత్రులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శేషవస్త్రాన్ని బహూకరించారు.

BRS leader Balka Suman lashes out at CM Revanth Reddy

ఆ సమయంలో రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీలపై కూర్చోగా.. వారికి ఇరువైపులా ఒక పక్కన చిన్నపాటి స్టూల్‌పై భట్టి విక్రమార్క, మరో పక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆసీనులై ఉండటం కనిపించింది. ఇది- తీవ్ర దుమారానికి దారి తీసింది.

భారత్ రాష్ట్ర సమితి నాయకులకు అస్త్రాన్ని అందించినట్టయింది. దళితుడు కావడం వల్లే అగ్రవర్ణాల నాయకులైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. భట్టి విక్రమార్కను తమతో సమానంగా కూర్చోనివ్వలేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.

BRS leader Balka Suman lashes out at CM Revanth Reddy

ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వారి కాళ్ల వద్ద కూర్చున్నారని విమర్శించారు. భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కంటే సీనియర్ నాయకుడని బాల్క సుమన్ గుర్తు చేశారు. బలహీన వర్గాల సామాజికవర్గానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కూడా అగ్రవర్ణాల ముఖ్యమంత్రితో సమానంగా కూర్చోలేకపోయారని మండిపడ్డారు.

BRS leader Balka Suman lashes out at CM Revanth Reddy

ఈ చర్య- యావత్ దళిత, బీసీ సామాజిక వర్గాలను తీవ్రంగా అవమానపరిచినట్టేనని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. సాక్షాత్తూ శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి చెంతనే దళిత, బీసీ సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని కించపర్చారని, ఇక తాము ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+