కోఠి మహిళా విశ్వవిద్యాలయం వీసీపై దుర్బాషలు: బీఆర్ఎస్ నేత అరెస్ట్
హైదరాబాద్: మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విజ్జులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గురువారం అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 1న తనకు తాను సామాజిక కార్యకర్తనంటూ.. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వీసీకి తెలిపారు. తనకు సన్మానం చేయాలని వీసీకి హుకుం జారీ చేశారు. అయితే, మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆర్థికంగా సహకరించాలని వీసీ ఆయనను కోరారు.

ఈ క్రమంలో తాను గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెబుతూ.. వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీనివాస్. 'నువ్వేమైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారి అనుకుంటున్నా? వీసీ అయ్యాక నీ కళ్లు నెత్తికెక్కాయి' అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్‌పై వీసీ.. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
సదాశివపేట్ పోలీసులపై కేఏ పాల్ ఫిర్యాదు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పోలీసులపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకుండా ఉండడానికి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మానవ హక్కుల కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులు లేకుండా చేశారని కేఏ పాల్ ఆరోపించారు. ధరణిని తీసుకువచ్చి తమ ఛారిటీ భూములను ఆగం చేశారని ఆరోపించారు.
6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉందని.. వారం రోజుల్లో మానవ హక్కుల కమిషన్.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు, సభ్యులను నియమించాలని కోరారు. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న సదాశివపేట పోలీసులను సస్పెండ్ చేయాలని.. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినట్లు పాల్ తెలిపారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications