కేటీఆర్ కేసు పై BRS కౌంటర్ ప్లాన్..!!
తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ-రేసు కేసుపై చర్యలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో.. నెక్స్ట్ ఏం జరిగతుంది అనేది దాదాపు స్పష్టత వచ్చింది. దీంతో.. బీఆర్ఎస్ నాయకత్వం అలర్ట్ అయింది. ఈ అంశం లో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించింది. ఈ సమయంలోనే కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకత్వానికి కీలక దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కేసును న్యాయ పరంగా ఎదుర్కుంటూనే రాజకీయంగా ముందుకు వెళ్లటం పైన నిర్ణయం తీసుకున్నారు.
కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు కేసులో చర్యలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీని ద్వారా కేటీఆర్ పై తీసుకునే చర్యల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో.. కేటీఆర్ పైన ఎలాంటి చర్యలకు అవకాశం ఉందనే అంశ పైన బీఆర్ఎస్ నాయకత్వం చర్చించింది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. కేటీఆర్ తన వాదన స్పష్టం చేసారు. అవినీతికి ఆస్కారం లేదనే అంశం పైన వివరణ ఇచ్చారు. ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తూనే... రాజకీయంగా ఎదుర్కోవటానికి సిద్దం కావాలని గులాబీ టీం డిసైడ్ అయింది. ఇందు కోసం రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ కేసు లో కేటీఆర్ ను టార్గెట్ చేసారనే వాదన తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్న విషయాన్ని బలంగా వినిపించాలని డిసైడ్ అయ్యారు.

అందులో భాగంగా తాజా పరిణామాల పైన మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కేటీఆర్‌పై రాజకీయ కక్షసాధింపులు పరాకాష్ఠకు చేరాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను సీఎం రేవంత్ నొక్కుతున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈరేస్ విషయంలో రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకుతుందని వ్యాఖ్యానిం చారు. ప్రభుత్వ వైఫల్యాల ను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. కేటీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications