రాజీనామాకు సిద్దం - హరీష్ రావు..!!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయం హోరా హోరీగా మారుతోంది. మెజార్టీ సీట్లు సాధించటం పైన కాంగ్రెస్ ఫోకస్ చేసింది. బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తామని చెబుతోంది. కేసీఆర్ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలు..రైతు రుణ మాఫీ పైన ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి హరీష్ నేరుగా సీఎం రేవంత్ కు సవాల్ చేసారు.
సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి స్పష్టం చేశారు. పంద్రాగస్టు లోగా ఆరు గ్యారెంటీలు, రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తే.. రాజీనామా చేస్తానని ప్రకటించారు.
కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.ప్రెస్ అకాడమీ చైర్మన్ వద్ద ఇద్దరి రాజీనామాలు ఉంచుదాం. రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ ఇచ్చిన 10 నిమిషాల్లోనే తన రాజీనామా లేఖ పంపిస్తానని చెప్పారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖ అందజేస్తానని స్పష్ట్ చేసిరు.

పంద్రాగస్టు లోగా ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ చేస్తే రాజీనామా ఆమోదించుకుంటాను. ఆ తర్వాత సిద్దిపేటకు రేవంత్ రెడ్డిని పిలిపించి శాలువాతో సన్మానం చేస్తానని పేర్కొన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఆ గడువు దాటిపోయినా పత్తా లేదన్నారు. ఇప్పుడేమో పంద్రాగస్టు లోగా చేస్తామని చెబుతున్నారు. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదన్నారు. రాష్ట్రాన్ని తెచ్చింది సిద్దిపేటనే.. తెలంగాణ రావడానికి కేసీఆరే కారణం. తెలంగాణకు, కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో తాజాగాీ హరీష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications