Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చార్ సౌ బీస్ గ్యారంటీలు గోవిందా

Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు సంధించారు. ఏ ఒక్క రంగానికి సమగ్ర బడ్జెట్ కేటాయింపుల్లేవంటూ మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన గ్యారంటీలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని, ఇక వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించినట్టేనని ఆరోపించారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనలపై అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడారు. భట్టి విక్రమార్క గంటన్నర పాటు సభలో బడ్జెట్‌పై సుదీర్ఘంగా ప్రసంగించారని, కేటాయింపులు మాత్రం జీరోగా తేల్చారని ధ్వజమెత్తారు.

KTR

ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇక గోవింద.. గోవిందా..అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. ఆరు గ్యారంటీల ఊసే బడ్జెట్‌లో లేదని, వాటి గురించి మరిచిపోయినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి తిలోదకాలు ఇచ్చిందనేది బడ్జెట్‌ ప్రతిపాదనలతో స్పష్టమైందని అన్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అనే మాటకు నేటితో పాతర వేసినట్టయిందని కేటీఆర్ మండిపడ్డారు. మహిళలకు ప్రతి నెలా 2,500 రూపాయల ఆర్థిక సహాయం కోసం ఉద్దేశించిన పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని చెప్పారు.

Take a Poll

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 2,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామంటూ మహిళలకు హామీ ఇచ్చి,వాళ్లతో ఓట్లు వేయించుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మహిళలు హతాశులయ్యేలా ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయింపుల్లేవని అన్నారు.

వృద్ధులకు ప్రతి నెలా 4,000 రూపాయల పింఛన్ కోసం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలేవని, 500 రోజుల తరువాత కూడా 4,000 పింఛన్ మొత్తం అమలు కావట్లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇక 4,000 రూపాయల పింఛన్ ఇక రాదనే విషయం వృద్ధులకు అర్థమైందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+