అక్రమ నిర్మాణాల సక్రమం: నాశనం చేస్తున్నారంటూ టీ సర్కారుపై హైకోర్టు ఫైర్

హైదరాబాద్: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ పథకాన్ని తీసుకొస్తూ నగరాన్ని నాశనం చేస్తున్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. క్రమబద్ధీకరణ విధివిధానాలను తమ ముందుంచాలని స్పష్టంచేసింది.

అక్రమంగా భవనాలను నిర్మించిన బిల్డర్లు, యజమానులు.. ఈ పథకం ముసుగులో క్రమబద్ధీకరించుకోవాలని చూస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. ఎలాంటి భవానాల్ని క్రమబద్ధీకరించదలిచారో తెలియజేయాలని తెలంగాణ అడ్వొకేట్‌జనరల్‌ కె రామకృష్ణారెడ్డికి స్పష్టంచేస్తూ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అనువుగా జీహెచ్‌ఎంసీ చట్టంలోని నిబంధనల సవరణ ఆర్డినెన్స్‌పై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

BRS May Vitiate Living Environment, Observes HC

కాగా, ఈ వ్యాజ్యంలో గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది శివరాజ్‌ శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. సెట్‌బ్యాక్‌లు లేకపోయినా, అగ్నిమాపక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినా, పరిమితికి మించిన ఎత్తులో కట్టినా కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించనుందని వివరించారు.

ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ పథకాన్ని పొడిగిస్తున్నాయన్నారు. సర్కారు తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ సవాలు చేసిన ఆర్డినెన్స్‌ ప్రస్తుతం ఉనికిలో లేదని, ఇందుకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించిందని వివరించారు. ఇది చట్టరూపం దాల్చబోతోందన్నారు. పథకంలోని కొన్ని నిబంధనలను ఏజీ, ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. లేఅవుట్‌ అనుమతి తీసుకోకుండా జరిపిన నిర్మాణాలను సైతం ప్రభుత్వం క్రమబద్ధీకరించనుందన్నారు. ఆ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ వ్యాజ్యం హైకోర్టులో అపరిష్కృతంగా ఉన్నంతకాలం ఏ విధమైన క్రమబద్ధీకరణలు జరపడానికి వీల్లేదని పునరుద్ఘాటించింది.

ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లును తీసుకొచ్చామని ఏజీ చెబుతున్న నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ అనుబంధ వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. ఎలాంటి నిర్మాణాల్ని క్రమబద్ధీకరించదలిచారో వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టంచేస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+