ఎక్కడ రావాలో చెప్పు, నేను సిద్దం - దానంకు కౌశిక్ సవాల్..!!

అసెంబ్లీలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత తన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు. దానం నాగేందర్ కు సవాల్ చేసారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడికి రావాలో చెప్పు అంటూ కౌశిక్ కీలక వ్యాఖ్యలు చేసారు.

దానంకు సవాల్
శాసనసభలో బీఆర్‌ఎస్‌ సభ్యులపై ఇష్టమొచ్చినట్లుగా అసభ్య పదజాలంతో దూషించిన దానం నాగేందర్‌పైనా కౌశిక్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. దానం నాగేందర్‌కు ముఖ్యమంత్రి మైక్‌ ఇప్పించి తమను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దానం నాగేందర్‌ సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం తాము కొట్లాడుతుంటే.. దానం నీచమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. దానం మాటలన్నీ నిరుద్యోగులను ఉద్దేశించినవేనని చెప్పారు. దానం బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

BRS MLA Kaushik Reddy wanrs Danam Nagenders over his comments in Assembly

ఎక్కడ రావాలో చెప్పు
హైదరాబాద్‌ నడిబొడ్డున తిరుగుతున్నా.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు అంటూ సవాలు విసిరారు. లక్ష్మారెడ్డి, సుధీర్‌ రెడ్డి ఉప్పల్‌లో ఉరికించింది మరిచిపోయావా అని ప్రశ్నించారు. దానం నాగేందర్‌ రెడ్డికి ఎమ్మెల్యే పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని కౌశిక్‌ రెడ్డి తెలిపారు. దానం నాగేందర్‌కు సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కూడా సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని పాడి కౌశిక్‌ రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.

రాజీనామా చేయాలి
అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్‌ క్యాలెండర్‌పైనా కౌశిక్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశంలో 2లక్షల 2 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్‌ మాత్రమేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు. తన సవాలుకు కాంగ్రెస్‌, బీజేపీ నోరు మెదపడం లేదని విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌పై ఎవరి సంతకం లేదని పేర్కొన్నారు. తేదీలు, ఉద్యోగ ఖాళీలతో జాబ్‌ క్యాలెండర్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+