రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు గాయాలు

నల్గొండ: బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా.. నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతోపాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్‌మెన్‌లు ఉన్నారు. కాగా, నల్గొండలో నిర్వహించిన కేసీఆర్ సభకు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఏదో కోపంలో పాలిచ్చే గేదెను కాదని.. దున్నపోతును ఎన్నుకురంటూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మరోవైపు, బీఆర్ఎస్ భకు వ్యతిరేకంగా పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.

BRS MLA Lasya Nanditha injured in road accident, while returning from kcr nalgonda meeting

బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు వారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వీరిని వీటీ కాలనీ వద్ద ఎన్ఎస్‌యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు తమ వీపులకు గో బ్యాక్ కేసీఆర్ అనే స్టిక్కర్లు అంటించుకున్నారు.
'కేటీఆర్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. పలువురు కోడిగుడ్లతో వాహనాలపై దాడి చేశారు. దీంతో అక్కడ స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అక్కడ్నుంచి ముందుకు కదిలారు.

ఇది ఇలావుండగా, నల్గొండ సభ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కుర్చీ వేసుకుని కూర్చొని కృష్ణా నది కింద ప్రాజెక్టులు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. పదేళ్లుగా పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మంగళవారం నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాలో ఓ కుర్చీవేసి దానిపై పింక్ టవల్ వేసి.. కేసీఆర్ ఫొటో పెట్టి నిరసన తెలిపారు.

బీఆర్ఎస్ సర్కారు నల్గొండ జిల్లాకు పూర్తిగా అన్యాయం చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. కేసీఆర్ నల్గొండలో సభ నిర్వహిస్తున్న క్రమంలో పలుచోట్ల కాంగ్రెస్ నిరసనలు తెలుపుతూ సమావేశాలు నిర్వహించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+