చిప్పకూడు తిన్నావ్.. దురదృష్టవశాత్తు MLC అయ్యావ్: కవితపై జనసేన సంచలన పోస్టులు
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత కొత్త చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో ఆమె బీభత్సంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. కారణం.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు. "అన్ ఫార్చునేట్ లీ హి బికేమ్ ఎ డిప్యూటీ సీఎం.." "హి ఈజ్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్ " అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.

దీంతో కవితపై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ ను కించపరిచేలా ఆయన స్థాయిని తగ్గించేలా కవిత మాట్లాడారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కవితను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయినప్పటి వీడియోలు బయటకు తీసి.. సీరియస్ పొలిటీషియన్ అంటే ఇలా స్కామ్ లు చేసి అరెస్ట్ కావాలేమో అని సెటైర్లు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రోల్ చేస్తున్నారు. కవిత చేసిన స్కామ్ వల్లే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ.. రెండూ అధికారాన్ని కోల్పోయాయని అంటున్నారు.
We don't think she is a serious politician, Unfortunately @RaoKavitha became MLC pic.twitter.com/M87DpHpQRO
— JanaSena Shatagni (@JSPShatagniTeam) April 10, 2025
కేసీఆర్ కూతురిగా వారసత్వ రాజకీయాలతో నెట్టుకొస్తున్న కవిత.. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అయ్యారని, పార్టీ పేరు చెప్పి ఆమె రాజకీయాలు చేస్తున్నారని జనసైనికులు విమర్శిస్తున్నారు. మరోవైపు నెటిజెన్లు స్పందిస్తూ.. పొరుగు రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేయొచ్చు కానీ, ఫలానా నాయకుడికి డిప్యూటీ సీఎం అయ్యేంత స్థాయి లేదు.. ఆయనకు అనుకోకుండా ఆ పదవి వరించింది.. అని అనడం ఎంతమాత్రం సమంజసం కాదని నెటిజన్లు అంటున్నారు.
మా ఖర్మ కాకపోతే చిప్ప కూడు తిన్న నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు! @RaoKavitha
— JSP WestGodavari (@JSPWestGodavari) April 9, 2025
నిజమే కనీసం ఇలాంటి ఒక స్కామ్ చేసి, జైల్ లో నెలలు గడిపి, చిప్ప కూడు తింటేనే కానీ నీలాగ సీరియస్ రాజకీయ నాయకులు అవ్వలేరులే!@JanaSenaParty @PawanKalyan pic.twitter.com/GsNg1tiLUq
అసలు సీరియస్ పొలిటీషియన్ అంటే కవిత దృష్టిలో ఎవరో చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద కవిత ఏరికోరి జనసైనికులతో ఏరికోరి ట్రోలింగ్ కు గురవుతున్నారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications