BRS: కేసీఆర్ నియంత పోకడలే పార్టీకి నష్టం కలిగించాయా..!

కారు.. సార్.. 16 అన్నారు.. 9 సీట్లతోనే సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత పార్టీ పేరును మార్చుకున్నారు. కేసీఆరే ప్రధాని కవాలన్నారు. దేశ్ కీ నేత అన్నారు. ఏపీతో పాటు మహారాష్ట్రలో కూడా పార్టీని విస్తరించారు. మూడో సారి కూడా అధికారం మనదే అన్నారు. సీన్ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టింది. ఇక లోక్ సభ ఎన్నికల్లో కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో బీఆర్ఎస్ పతనానికి కారణమేంటి.

టీఆర్ఎస్ తెలంగాణ స్వరాష్ట్రం కోసం స్థాపించిన పార్టీ. 2014 విజయం తర్వాత అధికారం చేపట్టింది. అయితే ఎంతో మంది ఉద్యమకారులను కాదని.. సమైక్య ఆంధ్ర కోసం పోరాడిన వారిని పార్టీలోకి తీసుకుంది. వారికి మంత్రి పదువులు ఇచ్చింది. తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవు, మైనంపల్లి హనుమంత రావు ఇలా చాలా మందిని పార్టీలో చేర్చుకుంది. కానీ ఎప్పటి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి అన్యాయం చేసింది.

BRS party is in danger in Telangana with KCR s decisions

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ, కుల పెత్తనం కొనసాగింది. తండ్రి సీఎం, కొడుకు మినిస్టర్, అల్లుడు మినిస్టర్, బిడ్డ ఎంపీ, కులపోళ్లు ఎమ్మెల్యేలు. అయినప్పటికీ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ను 2018లో గట్టేంకించాయి. ఆ తర్వాత అవినీతి పెరగడం, కేసీఆర్ నియంతృత్వ నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగేలా చేశాయి. ముఖ్యంగా పార్టీ పేరు మార్చడం ఆ పార్టీ చేసిన పెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితం అయింది. ఇక ఇప్పుడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. పార్టీ స్థాపించిన నుంచి ఇప్పటి వరకు ఎదో చోట బీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవలేక నాలుగో స్థానానికి పడిపోయింది. దీంతో బీఆర్ఎస్ కథ ముగిసిందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ ఇంకా నియంత పోకడలతో, కుటుంబ పెత్తనంతో, తన కులానికే ప్రాధాన్యం ఇస్తే.. ఆ పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+