కేటీఆర్ కేసులో అనూహ్య పరిణామం..!!

కేటీఆర్ పై నమోదైన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. కాగా, కేటీఆర్ హాజరు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. న్యాయనిపుణుల సలహా మేరకు తాను వ్యవహరిస్తానని కేటీఆర్ స్పష్టం చేసారు. అటు ఈడీ కూడా నోటీసులు ఇవ్వటంతో ఈ కేసులో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

నేడే విచారణ
ఫార్ములా-ఈ కారు రేసు కేసు లో కేటీఆర్ నేడు (సోమవారం) విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశాల్లో పేర్కొంది. అదే సమయంలో విచారణ కొనసాగించవ చ్చని పేర్కొంది. దీంతో, ఏసీబీ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని పేర్కొంది. దీంతో సోమవారం జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

BRS working chief KT Rama Rao is expected to appear before the ACB today in Formula E race case

హాజరవుతారా
ఇదే కేసులో అటు ఈడీ సైతం ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న బీఎల్‌ఎన్‌ రెడ్డి, అరవిందకుమార్‌ లనూ ఈ నెల 2, 3వ తేదిల్లోనే విచారణ కు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ, ఆ ఇద్దరూ వారం రోజుల సమయం కోరటంతో అంగీకరించింది. ఈ సమయంలోనే కేటీఆర్ విచారణకు వస్తారా, లేక సమయం కోరుతారా అనే అంం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. విచారణకు హాజరు కాకుంటే.. రాజకీయంగా విమర్శలకు అవకాశం ఇచ్చినట్లవుతుందనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది.

కేటీఆర్ చర్చలు
కేటీఆర్ ఇప్పటికే ఈ కేసులో ఏం జరిగిందో వివరించారు. ఏసీబీ ముందు హాజరై తన వాదన వినిపిస్తానని ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. కేటీఆర్ ఇచ్చే సమాధానాల ఆధారంగా ఈ కేసు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. కోర్టులోనూ ఇప్పటికే కేటీఆర్ తన అఫిడవిట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ రోజు ఏసీబీ ముందుకు కేటీఆర్ వస్తే.. రేపు (మంగళవారం) ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో, రెండు విచారణ సంస్థల ముందుకు కేటీఆర్ వస్తారా.. లేక, సమయం కోరుతారా అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాలా వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ లీగల్ టీంతో కేటీఆర్ ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+