ల్యాండ్ క్రూయిజర్ కార్లు స్మగ్లింగ్ చేసిన కేటీఆర్?
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా చెలామణి అవుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగకుండా ఉండివుంటే అధికారంలోకి వచ్చివుండేవారిమని భారతీయ జనతాపార్టీ తెలంగాణ శ్రేణులు ఇప్పటికీ వాపోతుంటారు. అంతటి క్రేజ్ ను పార్టీకి తీసుకురావడమేకాదు.. తనకు కూడా తెచ్చుకున్న సంజయ్ ఇప్పుడు తనకు తానే ఫైర్ బ్రాండ్ అని చెప్పుకుంటున్న కేటీఆర్ పై సంచలన ఆరోపణ చేశారు. దీనికి సమాధానం మాత్రం కేటీఆర్ దగ్గర లేదు. ప్రస్తుతం అతను వాడుతున్న ల్యాండ్ క్రూయిజర్ కార్లు అక్రమంగా దిగుమతి చేసినవేనని, స్మగ్లింగ్ చేశారని బండి సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ లక్కీ నెంబరే కార్లకు ఉంది
బషరత్ ఖాన్ అనే వ్యక్తిని గుజరాత్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పన్ను కట్టకుండా లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నారని అతనిపై ఆరోపణలు వచ్చాయి. అలా వచ్చిన కార్లను సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు విక్రయిస్తున్నాడు. అయితే అతను దిగుమతి చేసుకున్న కార్లు కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్న కంపెనీ కింద రిజిస్టర్ అయ్యాయి. ప్రస్తుతం కేటీఆర్ వాడుతున్న కార్లు కూడా అవే. మాజీ సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ 6666. ఈ కార్లకు కూడా అవే నెంబర్లు వాడుతున్నారు. ఈ విషయాలన్నీ మంత్రి సంజయ్ వెల్లడించారు.

మనీ లాండరింగ్ కు పాల్పడ్డారా?
కేటీఆర్ ఈ కార్లను ఎలా కొన్నారు? ఎక్కడ కొన్నారు? వాటికి డబ్బులు ఎలా చెల్లించారు? రేటు ఎక్కువ పెట్టారా? తక్కువ పెట్టారా? బీనామీ పేర్లమీద ఉన్నాయా? మార్కెట్ ధరకే కొనుగోలు చేశారు? డబ్బులు చెల్లించడానికి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారా? గుర్తు తెలియని ఆదాయం నుంచి కొనుగోలు చేశారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సంబంధించి అన్ని శాఖలు దర్యాప్తు చేయాలని, నిజాన్ని వెలికి తీయాలని, కేసీఆర్ కుటుంబం ఈ నేరంలో ఉందని తాను కచ్చితంగా నమ్ముతున్నట్లు చెప్పారు. దీనికి బీఆర్ఎస్ తరఫున స్పందించిన జగదీష్ రెడ్డి సంజయ్ ఎక్కడ కార్లు కొన్నారో కేటీఆర్ కూడ అక్కడే కొన్నారని చెప్పారు. ఈ కార్ల విషయంలో ఏదో బయటకు తెలియని విషయం ఉన్నట్లు అర్థమవుతోందని జగదీష్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications