రక్తసంబంధం : కన్న కొడుకు కోసం రష్యా నుండి హైద్రాబాద్ కు వచ్చిన తండ్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ :భర్త మోసం చేశాడని అనేక మంది మహిళలు ఆందోళలనలు చేయడం చూశాం. కాని, తన కొడుకును అప్పగించాలంటూ ఓ రష్యన్ పౌరుడు హైద్రాబాద్ లో ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకును అ ప్పగించాలని భార్యను వేడుకొంటున్నాడు.తన డిమాండ్ నేరవేర్చాలని ఆయన మౌనపోరాటానికి దిగాడు.

2012 లో హైద్రాబాద్ యువతి సనంతో రష్యాకు చెంిన అలెక్స్ ఉల్ హక్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది. ప్రేమికులు ఇద్దరూ పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు 2014 బేగంపేట్ రిజిస్టర్ ఆఫీస్ లో సనంతో అలెక్స్ వివాహం చేసుకొన్నాడు. వారికి కుమారుడు పుట్టిన తర్వాత వారిద్దరూ రష్యాకు వెళ్ళారు.

came back from russia for his son

రష్యా వెళ్ళి కొద్దిరోజులు అక్కడే గడిపారు ఆ దంపతులు. సనం కు వీసా గడువు ముగిసింది. వీసా గడువు ముగియడంతో భర్తకు చెప్పకుండానే సనం భర్తకు చెప్పకుండానే హైద్రాబాద్ కు తిరిగి వచ్చింది.

భార్య, కొడుకు కోసం అలెక్స్ హైద్రాబాద్ వచ్చాడు. హైద్రాబాద్ లో భార్యను కలిశాడు. కుమారుడిని ఇవ్వాలని కోరాడు. అయితే ఆమె మాత్రం కుమారుడిని ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేస్తోందని అలెక్స్ ఆరోపిస్తున్నాడు. తన కొడుకును తనకు ఇప్పించాలని కోరుతూ ఆయన మౌనపోరాటం చేస్తున్నాడు. తన కొడుకును తనకు ఇప్పించేందుకు గాను తన భార్య డబ్బులు డిమాండ్ చేస్తోందని అల్వాల్ పోలీస్ స్టేషన్ లో భార్యపై ఫిర్యాదు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
russian young man alex , hyderabad lady sanam married in 2012, they get son after one year, they went to russia, sanam came back to india withour information his husband alex, alex also came back to india, alex ask to give his son, sanam demand some money to give his son , alex complient against sanam in the alwal police station.
Please Wait while comments are loading...