విద్యార్థినుల బాత్‌రూంలో కెమెరాలు: ఇద్దరి అరెస్ట్

మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో అమ్మాయిల బాత్రూంల్లో వీడియోలు తీసిన ఘటన కేసులో పోలీసులు ఆదివారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1 నంద కిశోర్, ఏ2 గోవింద కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. కాలేజీ ఛైర్మన్ చామకూరి గోపాల్ రెడ్డి సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గోపాల్ రెడ్డిని ఏ7గా చేర్చారు.

కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలోని ఐటీ క్యాంపస్ హాస్టల్‌లోని స్నానాల గదిలో విద్యార్థినుల వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కండ్లకోయ సీఎంఆర్ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లోని బాత్‌రూంలో కెమెరాలు పెట్టి వీడియోలు తీశారని బుధవారం రాత్రి విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్.

Cameras found in CMR College female students bathroom Two arrested

వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు. వారి సెల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు. కాగా, నిందితులు వీడియోలు చిత్రీకరిస్తున్న సమయంలో కిటీకీలపై కొన్ని చేతి ముద్రలు ఉండడాన్ని గమనించిన విద్యార్థినులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ విషయంపై మేడ్చల్​ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. విద్యార్థినుల వసతి గృహాలను పరిశీలించిన వారు కొన్ని గదులు సిబ్బందికి అనుసంధానం చేసి ఉన్నాయని తెలిపారు. అలా ఉండటం వల్ల వీడియోలు తీయడానికి ఆస్కారం ఉందన్నారు.

బాత్రూం​ల వెంటిలేటర్లు ఇతర గదులకు అనుసంధానం చేసి ఉన్నాయని ఏసీపీ తెలిపారు. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో వీడియోలు తీశారా?, డిలీట్​ చేశారా? లేదా అన్నదానికి కోసం ప్రత్యేక సాఫ్ట్​‌వేర్​ ద్వారా తెలుసుకుంటున్నామని చెప్పారు. ఒకవేళ రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+