విద్యార్థినిల బాత్రూంల్లో కెమెరాలు..! సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్‌రూంలో కెమెరాలు అమర్చినట్లుగా గుర్తించిన విద్యార్థినిలు.. రహస్యంగా తమ వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కాలేజీలో విద్యార్థినీవిద్యార్థులు ఆందోళనకు దిగారు.

వీడియోలు తీసినవారు హాస్టల్‌లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బాధ్యులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. తమ గోప్యతకు భంగం కలిగించిన ఈ దారుణ ఘటనపై కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

Cameras in female students bathrooms Students agitation at CMR College

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులతో మాట్లాడి, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనను విరమించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు, ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. హాస్టల్ విద్యార్థినుల భద్రతకు సంబంధించిన ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కాలేజీ యాజమాన్యం భద్రతా వ్యవస్థను సమీక్షించి, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది ఇలావుండగా, నిందితుల దగ్గర ఇందుకు సంబంధించిన 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అంతేగాక, ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. సదరు వీడియోలతో విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసి విషయం బయటకు రాకుండా చూసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+