రేవంత్ బ్రదర్స్‌ను అరెస్ట్ చేయలేదే..? అల్లు అర్జున్ అరెస్ట్‌పై హరీశ్ రావు

Allu Arjun: ప్రముఖ సినీనటుడు, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందిన కేసులో శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అసలు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది ఎవరు అని హరీశ్ రావు ప్రశ్నించారు. ముందస్తు జాగ్రత్తలో తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని నిలదీశారు. సినిమా చూసేందుకు వెళ్లి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని హరీశ్ రావు అన్నారు. దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులేనని ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అని అన్నారు.

Can t Revanth Brothers be arrested Harish Rao on Allu Arjun s arrest

రేవంత్ రెడ్డి బ్రదర్స్ వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని హరీశ్ రావు నిలదీశారు. రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా.. అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే.. కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్ట్ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్ట్ చేయాలని ప్రశ్నించారు. ఫుడ్ పాయిజన్‌లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు.. దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలని నిలదీశారు. ఫార్మాసిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారని మండిపడ్డారు. దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలని ప్రశ్నించారు. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు.. ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలని డిమాండ్ చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాకూడదని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+