పాలనలో అసలు సిసలు మొగోడు కేసీఆర్.. : కెప్టెన్ లక్ష్మీకాంతరావు
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు. సీఎం కేసీఆర్ ని అసలు సిసలైన మొగోడిగా అభివర్ణించిన లక్ష్మీకాంతరావు ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లే అడగనని సవాల్ చేసిన నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు.
త్వరలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలన గురించి రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల గురించి ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 21వ తేదీ తర్వాత తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి కేంద్ర నుంచి సహాయ సహకారాలు అందాల్సి ఉన్న క్రమంలో ఆ దిశగా కృషి చేస్తానని చెప్పారు. హైకోర్టు విభజన, నిధులకు సంబంధించిన విషయాల్లో పార్లమెంటు సభ్యుడిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో దేశం అభినందించదగ్గ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పిన ఆయన, మిషన్ కాకతీయ వంటి పథకాలకు ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందాయన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తులకు తప్ప మరో వ్యక్తికి ఇలాంటి పథకాలు కనీసం ఊహకు కూడా అందవని స్పష్టం చేశారు.
మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి సిద్దపడని సవాల్ కి సిద్దపడిన నాయకుడు కేసీఆర్ అని కితాబిచ్చిన కెప్టెన్, ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని ప్రకటించుకోవడం ఒక్క కేసీఆర్ కే సాధ్యమైందని, అందుకే ఆయన మొగోడు అని ఆకాశానికెత్తేశారు.
ఇక ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై స్పందించిన ఆయన, కోదండరామ్ వ్యాఖ్యలు బట్ట కాల్చి మీదేసినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోసేవాడికే కావడి బరువు తెలుస్తుందని వ్యాఖ్యానించిన ఆయన అసలు ఏం కావాలో స్పష్టత లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఎలా..? అంటూ కోదండరామ్ ని ప్రశ్నించారు.
కులవృత్తులు సంక్షోభంలో ఉన్నాయని ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యల పట్ట స్పందిస్తూ.. కులవృత్తుల సంక్షేమం కోసం ఓ మంచి ప్రణాళిక సిద్దం చేసి ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చని చెప్పిన ఆయన, సీఎం కేసీఆర్ కి రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉందని, ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన పాలన కొనసాగుతుందన్నారు.
అలాగే పార్టీ భవిష్యత్తు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. టీఆర్ఎస్ కేంద్రంలో భాగస్వామి కావాల్సిన అవసరం లేదన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications