వామ్మో, ఎండకాలం: అగ్నికి దగ్ధమైన కారు!(ఫోటో)
హైదరాబాద్: కారులో మంటలు చేలరేగి హైదరాబాదులో గురువారం కలకలం సృష్టించింది. నల్గొండ జిల్లా వలిగొండ సంగం గ్రామానికి చెందిన సురేందర్ కొంతకాలంగా సరూర్‌నగర్‌లో ఉంటూ కారును నడుపుతున్నాడు.
గురువారం మధ్యాహ్నం సురేందర్ (టిఎస్ 08 యుఏ 1865) ఇండికా కారులో అత్తాపూర్ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తుంతుండగా అత్తాపూర్ బ్రిడ్జిపై ముందున్న ఇన్నోవాను ఢీకొంది. ఈ క్రమంలో కారు డ్రైవర్ సురేందర్, ఇన్నోవా డ్రైవర్‌లు ఇద్దరూ గొడవకు దిగారు.

అంతలోనే సురేందర్ కారుకు మంటలు అంటుకుని ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం, ఎండ వేడి కారణంగా తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు, ప్రయాణికులు పరుగు తీశారు. స్థానికులు పోలీసులతో పాటు ఫైర్ స్టేషన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు.
వెంటనే స్థానిక పోలీసులతో పాటు ఫైర్ ఇంజన్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ ఇంజన్ నీళ్లుతో ఆర్పేసరికే కారుపూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కలుగలేదు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications