'ఇంగ్లీష్, సెక్స్' రెండూ మిక్స్ చేసి బోల్తా కొట్టిస్తుంది: మహా మాయ లేడీ..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మాటలు నేర్చిన చిలుక ఎంతటి ముదుర్లనైనా ఇట్టే బోల్తా కొట్టించేయగలదు. ఇటీవల వెలుగుచూస్తున్న మాయ లేడీల మోసాలను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. కావాలనే ఫోన్ చేస్తారు.. ఆ తర్వాత హయ్యో రాంగ్ నంబర్ అంటూనే.. మాటలు కలిపే ప్రయత్నం చేస్తారు.

అమ్మాయి కదా! అని అలుసిచ్చారనుకోండి.. ఇక అంతే సంగతి. మాటలతో లొంగదీసుకుని, ఆపై అశ్లీల పదాలతో రెచ్చగొట్టి, లేనిపోని కోరికలతో ఊపిరి సలపకుండా చేస్తుంది. మోహంలో ముంచెత్తి.. ఆపదలో ఉన్నాను డబ్బులు కావాలంటూ అభ్యర్థిస్తుంది. ఇచ్చారా? ఓకె.. లేదంటే, తనతో మాట్లాడిన అసభ్య ఫోన్ సంభాషణను బయటపెడుతానంటూ బెదిరిస్తుంది.

case filed on married woman on charges of cheating men

ఇలా ఇప్పటికీ ఆ మాయా లేడీలో వలలో ఎంతో మంది చిక్కుకున్నారు. పరువు పోతుందని ఎవరూ బయటపడకపోగా.. ఇటీవల ఈ మాయలేడీ బాగోతం వెలుగుచూడటంతో.. ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి.

అందం, ఇంగ్లీషులో మాట్లాడగల నేర్పు.. ఆమెతో మాట్లాడినవారెవరైనా సరే హైక్లాస్ అమ్మాయి అని ఫిక్స్ అయిపోతారు. అలా ఫిక్సయ్యే ఎంతోమంది చిక్కుల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. ఆఖరికి ఇంటి యజమానిని కూడా బుట్టలో వేసుకున్న ఈ మాయా లేడీ, యజమానిని బ్లాక్ మెయిల్ చేస్తూ రెండేళ్లుగా అద్దె కూడా చెల్లించడం లేదు. సదరు యజమాని కూడా ఆమెను అద్దె అడిగే ధైర్యం చేయడం లేదు.

ఈ మాయ లేడీ ఉచ్చులో పోలీసులు సైతం ఉండటం గమనార్హం. ఎస్సైలు,ఏఎస్ఐలు, పలువురు వైద్యులు సైతం ఈమె వలలో చిక్కుకుని మోసపోయారు. వీరి వద్ద నుంచి రూ.5లక్షల దాకా ఆమె గుంజినట్లు తెలుస్తోంది. ఎస్ఆర్ నగర్ కు చెందిన ఈ మాయ లేడీపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A case was filed on a married woman in SR Nagar circle. Police found that she cheats police men also
Please Wait while comments are loading...