ఓటుకు నోటు: వాహనాలిచ్చేయండి, రేవంత్‌కు ఫోన్లు.. రైతు అమాయకుడే
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడిన కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్ వాహనాన్ని తిరిగి ఆయనకు ఇచ్చేయాలని ప్రత్యేక కోర్టు బుధవారం ఎసిబిని ఆదేశించింది.
ఇందుకు సెబాస్టియన్ రూ.2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అదేవిధంగా అరెస్టు సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న కేసుతో సంబంధం లేని ఇతర డాక్యుమెంట్లు తిరిగివ్వాలని ఆదేశించింది.
ఉదయ్ సిన్హా నుంచి స్వాధీనం చేసుకున్న కారు అతడిది కాకపోవడంతో కారు యజమానిని హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దర్యాఫ్తు పూర్తయి, ఛార్జీషీటు దాఖలు చేసినందున తమ వాహనాలను ఇప్పించాలని నిందితులు పిటిషన్లు పెట్టుకున్నారు.

రాములు అమాయకుడు: ఎసిబి
ఓటుకు నోటు కేసులో కరీంనగర్ జల్లా రైతు రాములు అమాయకుడని ఎసిబి తేల్చింది. ఓటుకు నోటు కేసులో కరీంనగర్ జిల్లా రైతు రాములుకు ఎసిబి ఇటీవల నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన రైతు. అయితే, ఇప్పుడు వాచ్‌మన్‌గా ఉంటున్నాడు.
ఓటుకు నోటు కేసులో తమ ఎదుట హాజరు కావాలని ఎసిబి అదికారులు సిరిసిల్లకు చెందిన రాములుకు నోటీసులు జారీ చేయగా ఆయన బుధవారం ఎసిబి కార్యాలయానికి వచ్చారు.
రాములు చిరునామాతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి రేవంత్ రెడ్డికి ఫోన్లు వెళ్లాయని, ఇందుకు గల కారణాలను నివృత్తి చేసుకునేందుకు రాములును పిలిచారు. అయితే, తన ఫోన్ చాలాకాలం క్రితమే పోయిందని రాములు చెప్పాడు. ఆయనను విచారించిన ఎసిబి రాములు ఫోన్ పోయిన మాట వాస్తవమేనని, ఆయనకు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications