తెర వెనుక ఉన్నదెవరు - లావాదేవీలపైనే ఫోకస్ : చీకోటిని విచారిస్తున్న ఈడీ..!!


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సోదాల సమయంలో కీలక సమాచారం సేకరించిన ఈడీ అధికారులు..ఇప్పుడు ఇందులో ప్రధానంగా భాగస్వామలులైన చీకోటీ ప్రవీణ్‌ బృందాన్ని విచారిస్తోంది. ప్రవీణ్‌, మాధవరెడ్డి నివాసాల్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు వారి ల్యాప్ టాప్ లు... మొబైల్ ఫోన్లు..బ్యాంకు ఖాతాల నుంచి సమాచారం తీసుకున్నారు. వారి లావాదేవీల్లో ఉన్న వ్యక్తులు..నగదు బదిలీ వంటి అంశాల పైన వివరాలు సేకరించేందుకు ఈ రోజు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు.

కొనసాగుతున్న ఈడీ విచారణ

కొనసాగుతున్న ఈడీ విచారణ

దీంతో...చీకోటి ప్రవీణ్ తో సహా నోటీసులు అందుకున్న వారు ఈడీ ముందు హాజరయ్యారు. విదేశాల్లో క్యాసినో క్యాంపులకు వందలమంది పంటర్లను తరలించినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. క్యాసినో పేరుతో జరిగిన దేవీలపై ప్రవీణ్‌తో పాటు బోయిన్‌పల్లికి చెందిన మాధవరెడ్డి, ట్రావెల్‌ ఏజెంట్‌ సంపత్‌లను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా విదేశీ క్యాసినో పేరుతో జరిగిన లావాదేవీలపైనే ఈడీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ .. మాధవరెడ్డితో పాటుగా ట్రావెల్‌ ఏజెంట్‌ సంపత్‌లను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

ఆర్దిక లావాదేవీలపైనే ఆరా

ఆర్దిక లావాదేవీలపైనే ఆరా


సోదాల సమయంలో బ్యాంకు ఖాతాల వివరాలు.. లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఈడీ అధికారులు కోరటంతో .. ఈ రోజున విచారణ సమయంలో వాటిని అందించినట్లుగా తెలుస్తోంది. నేపాల్‌, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్‌ బృందం తరలించినట్లు ఇప్పటికే ఈడీ నిర్దారణకు వచ్చింది. క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచిందనేది ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన అభియోగం.

రాజకీయ లింకులపైనా ఫోకస్

రాజకీయ లింకులపైనా ఫోకస్


అదే విధంగా ప్రవీణ్ కమీషన్ల రూపంలో భారీగా సంపాదించారని..ఈ మొత్తం హవాలా రూపంలో వచ్చిందిగా అనుమానిస్తున్నారు. దీంతో..వీటి పైన అన్ని కోణాల్లోనూ ఈడీ అధికారులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ ఖాతాల నుంచి కొంత మంది సినీ - రాజకీయ నేతలతో జరిగిన లావాదేవీలపైన ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..ప్రవీణ్ ఇచ్చే సమాచారం ఆధారంగా ఈడీ మరి కొందరికి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో..ఈ మొత్తం విచారణ సమయంలో ప్రవీణ్ సమయంలో చెప్పబోయే సమాచారం తదుపరి విచారణకు కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+