తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం దిమ్మతిరిగే షాక్..ఆ నిధుల్లో భారీకోత!
దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యంలేని కార్మికుల కోసం ఉపాధిహామీ పథకాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఉపాధి హామీ పాత పథకాన్ని రద్దుచేసి , కొత్త పథకాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేంద్రం ఉపాధి హామీ పనులను వంద రోజుల నుండి 125 రోజులకు పెంచుతూనే, ఇచ్చే నిధులను మాత్రం కుదించింది.
కేంద్రం కొత్త పథకం వికసిత్ భారత్ జీరాంజీ
2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ రద్దు చేసింది. దాని స్థానంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్ గార్ యోజన ఆజీవికా మిషన్ వీబిజి రాంజీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఇంతకుముందు ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకంతో, ఈ స్కీం కింద పనిచేస్తున్న కూలీలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు చెల్లిస్తుంది.

కేంద్రం నుండి నిధులు 60 శాతం, రాష్ట్రం 40శాతం
ఇప్పుడు కొత్తగా మారిన పథకంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కూలీలకు నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఇకనుంచి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ 40 శాతం భరించాల్సి ఉంటుంది.ఇందులో మరొక కీలక మార్పులు కూడా చేశారు. ఇప్పటివరకు ఉపాధిహామీ అనేది హక్కుగా ఉండేది కానీ ప్రస్తుత ఆ హక్కును తొలగించి రాష్ట్రం మొత్తం కాకుండా ఎంపిక చేసిన, అవసరమైన చోట్లనే అమలు చేయడానికి కేంద్ర నిర్ణయించింది.
రాష్ట్రంపై భారీగా ఆర్ధిక భారం
కేంద్రం కేటాయించిన నిధులు ఖర్చు చేస్తే, ఆ తర్వాత ఒకవేళ పని చేసిన రాష్ట్రం నిధులను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది రాష్ట్రంపైన ఆర్థికంగా భారాన్ని వేస్తుంది. తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు ప్రతి సంవత్సరం నేరుగా వాళ్ళ ఖాతాలలో దాదాపు 2600కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉపాధిహామీ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి.
తెలంగాణాపై సుమారు 1500కోట్ల ఆర్ధిక భారం
ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల పైన ఆర్థిక భారం పడుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1500 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా నిబంధన రాష్ట్రం పైన ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications