హైదరాబాద్‌కు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈవో..
మిస్ వరల్డ్ 2025 పోటీల కోసం తెలంగాణలోని హైదరాబాద్ నగరం ముస్తాబవుతుంది. ఈనెల 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నాయి. పోటీల్లో మొత్తం 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈవో జూలియా ఈవేలిన్ మోర్లీ ఇవాళ ఉదయం నగరానికి చేరుకున్నారు. ఈ మేరకు ఆమెకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో సాంప్రదాయ రీతిలో అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాలలో చేపట్టిన ఏర్పాట్లు.. పలు ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షించనున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సీఎం సమీక్ష..
ఇక ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం తీసుకోవాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పట్టణ అభివృద్ధి సహా పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులు, మంత్రులతో సమగ్రంగా చర్చ జరిపారు. ఈ పోటీల కోసం విదేశాల నుంచి వచ్చే కంటస్టెంట్స్, గ్లోబల్ అతిథులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటళ్ల వరకూ ప్రత్యేక వీఐపీ వాహనాలు, వెల్కమ్ టీంలను ఏర్పాటు చేయాలని, గెస్ట్‌లు గమ్యం చేరే సమయానికి ప్రతి విషయాన్ని ప్రొఫెషనల్‌గా నిర్వహించాలని సూచించారు.
అంతే కాకుండా పోటీలలో పాల్గొనేవారికి తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే విధంగా హోటళ్లలో 'వెల్కమ్ కిట్స్', స్పెషల్ మెనూలు, పర్సనలైజ్డ్ హాస్పిటాలిటీని అందించాలన్నారు. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు హోటళ్ల వద్ద ప్రత్యేక భద్రతా బలగాలు, మహిళా పోలీస్‌లు అందుబాటులో ఉండాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అతిథులకు భాషా సమస్యలు తలెత్తకుండా ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రెటర్స్‌ను నియమించాలన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications