చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ - మైండ్ బ్లోయింగ్ ఫెసిలిటీస్ ఇవే..!

చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరికొన్ని వారాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగర ప్రాంతంలో రైళ్లు ప్రధానంగా మూడు ప్రధాన టెర్మినల్స్ అయిన సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు కాచిగూడ ద్వారా సేవలు అందిస్తున్నాయి. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్నరద్దీ అవసరాలను తీర్చడానికి, జంట నగరానికి పశ్చిమ భాగంలోని లింగంపల్లిని మరొక టెర్మినల్ స్టేషన్ గా అభివృద్ధి చేయబడింది. ఇదే వరవడిని ముందుకు తీసుకెళ్ళే దిశలోభాగంగా చెర్లపల్లి రైల్వేస్టేషన్ ను మరో టెర్మినల్ స్టేషన్ గా అభివృద్ధి చేయబడుతుంది.

చర్లపల్లి హైదరాబాద్ కు తూర్పు వైపున ఉంది. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది మరియు ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానానికి సమీపంలో సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా జంట నగర ప్రాంతంలో ఉన్న ఇతర రైలు టెర్మినల్స్లో రద్దీని తగ్గించడo మరియు ముఖ్యంగా నగరం తూర్పు భాగంలోని ప్రయాణీకులకు సేవలను అందించడానికి కూడా ఈ స్టేషన్ను టెర్మినల్ స్టేషన్ గా అభివృద్ధి చేయబడుతుంది.

Charlapalli Railway terminal works come to an end benefit east Hyderabad

430 కోట్ల రూపాయలతో...

చర్లపల్లి రైల్వే టెర్మినల్లో 430 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రయాణికులకు అనేక వసతుల ఏర్పాటు చేయబడుతున్నాయి. అధిక ప్రయాణికుల రాక పోకలకు అనుగుణంగా కొత్తగా నిర్మితమౌతున్న ఈ స్టేషన్ భవనం అత్యంత ఆధునికంగా మరియు సౌందర్య వంతమైన ముఖ్య ద్వారంతో నిర్మించడం జరుగుతోంది.

ఈ స్టేషన్ భవనం లో గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ మరియు మొదటి అంతస్తులో కేఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలకు మరియు పురుషులకు కోసం విశ్రాంతి గదులు ఉంటాయి. స్టేషన్ భవనంలో విశాలమైన కాన్కోర్స్ ప్రాంతాలు మరియు స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్వ్యవస్థ ఏర్పాటు చేయబడుతోంది .

Charlapalli Railway terminal works come to an end benefit east Hyderabad

అదనంగా 4 అదనపు ఎత్తైన ప్లాట్ఫారమ్లు ఉంటాయ మరియు ఇప్పటికే ఉన్న 5 ప్లాట్ఫారమ్లు కూడా పూర్తి నిడివితో పునర్నిర్మాణం చేయబడి రైళ్లను నిర్వహించడానికి సిద్దంచేయ బడ్డాయి. రెండు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు - ఒకటి 12 మీటర్ల వెడల్పు మరియు మరొకటి 6 మీటర్ల వెడల్పు - ప్లాట్ఫారమ్ల మధ్య కదలికను సులభతరం చేయడానికి. ఇంకా, మొత్తం 9 ప్లాట్ఫారమ్లలో ఎస్కలేటర్లు మరియు లిఫ్టులు ఉంటాయి, అంటే మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ప్రయాణీకుల కదలికను సులభతరం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేషన్ నుండి రైళ్లను ప్రారంభించేందుకు కోచ్ నిర్వహణ సౌకర్యాలను కూడా కలిగి ఉన్నాయి.

Charlapalli Railway terminal works come to an end benefit east Hyderabad

స్టేషన్లో వచ్చే ఇతర ప్రధాన సౌకర్యాలు

బస్ బే, కోచ్ ఇండికేషన్ బోర్డులు మరియు రైలు సూచన బోర్డులతో పాటు 4-వీలర్, 3-వీలర్ మరియు టూ-వీలర్ వాహనాలకు తగిన స్థలం, అన్ని ప్లాట్ఫారమ్లలో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, యట్ ఏ గ్లాన్స్ బోర్డులు, 24 గంటలు సి. సి. టి. వి నిఘా వ్యవస్థ మొదలైనవి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+