బయటకొచ్చాక మరింత అందం, సిట్‌నే విచారించినట్లుగా: చార్మీపై వర్మ, వెటకారం
సిట్ విచారణ అనంతరం సినీ నటి చార్మీలో మరింత అందం, ఆనందం కనిపించిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. వెటకారంగా పోస్టులు పెట్టారు.
హైదరాబాద్: సిట్ విచారణ అనంతరం సినీ నటి చార్మీలో మరింత అందం, ఆనందం కనిపించిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. వెటకారంగా పోస్టులు పెట్టారు.

చార్మీ మరింత అందంగా
చార్మీని బుధవారం సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం విచారించింది. ఈ నేపథ్యంలో ఆయన ఫేస్‌బుక్ ద్వారా మరోసారి డ్రగ్స్ వ్యవహారంపై స్పందించారు. సిట్ కార్యాలయంలోకి వెళ్లినప్పటి కంటే బయటకు వస్తున్నప్పుడు చార్మీ మరింత అందంగా కనిపించిందని వర్మ కామెంట్ పెట్టారు.

చార్మీ గోళ్లు తీయలేదు కానీ
ఇప్పటి వరకు పలువురు నటుల గోళ్లు, వెంట్రుకలను సిట్ అధికారులు తీసుకున్నారని వర్మ పేర్కొన్నారు. కానీ ఈ రోజు విచారణలో చార్మీ గోళ్లు తీయలేదని, మానిక్యూర్ చేసినట్లుగా ఉందన్నారు.

ఝాన్సీలక్ష్మీబాయి కంటే
సిట్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న చార్మీని చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయిని మించిన ధైర్యసాహసాలు కనిపించాయని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

చార్మీయే సిట్‌ను ప్రశ్నించినట్లుగా..
చార్మీ బయటకు వచ్చిన తీరు చూస్తుంటే సిట్ అధికారులనే ఆమె ప్రశ్నించినట్లుగా కనిపిస్తోందని వర్మ పేర్కొన్నారు. బయటకు వచ్చేటప్పుడు చార్మీ సంతోషం, ఆమె ముఖంలోని ఆనందం చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications