10 ఏళ్ళ పాటు ఎంజాయ్, మరో యువతితో వివాహం: ఓయూ అసిస్టెంట్ ప్రోఫెసర్‌పై కేసు
హైదరాబాద్: పదేళ్ళుగా ఓ యువతితో స్నేహం చేయడమే కాదు పెళ్ళి చేసుకొంటానని నమ్మించి అన్ని అవసరాలను తీర్చుకొని మరో యువతిని వివాహం చేసుకొన్నాడని బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను నమ్మించి తన నుండి రూ.25 లక్షలను కూడ తీసుకొన్నాడని ఓ ప్రోఫెసర్ పై బాధితురాలు కేసు పెట్టింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.
హైద్రాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రోఫెసర్ గా డాక్టర్ కిరణ్ కుమార్ పనిచేస్తున్నాడు. అయితే ఓయూ కెమిస్ట్రీ విభాగంలోనే పరిశోధనలు చేస్తున్న యువతి మరో యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రోఫెసర్ గా పనిచేస్తోంది. ఉప్పల్ కు చెందిన డాక్టర్ కిరణ్ కుమార్ ఓయూ టెక్నాలజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రోఫెసర్ గా , ఓయూ పరీక్షల విభాగంలో అదనపు కంట్రోలర్ గా పనిచేస్తున్నాడు.

ఓ మ్యారేజ్ బ్యూరో ద్వారా డాక్టర్ కిరణ్‌కుమార్ సంబంధం వచ్చింది. ఇద్దరు ఇష్టపడటం తో పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. పదేళ్లుగా స్నేహం కొనసాగిస్తున్న కిరణ్‌కుమార్ వివిధ అవసరాల పేరుతో తన నుండి రూ.25లక్షలు తీసుకున్నాడని యువతి ఆరోపిస్తోంది. . ఇటీవల ఆమె తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడంతో చేయడంతో తన అక్కల వివాహం జరిగిన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని బాధితురాలు చెబుతోంది. అంతేకాదు ఆ తనపై వేధింపులకు పాల్పడమేగాక తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు డాక్టర్ కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తనతో పదేళ్ల పాటు స్నేహం చేసి లైంగికంగా, మానసికంగా , శారీరకంగా వేధింపులకు గురిచేసిన కిరణ్‌కుమార్‌పై నిర్భయ కేసు పెట్టాలని బాధితురాలు డిమాండ్ చేసింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.25లక్షలు తీసుకున్నాడని, తీరా మరో యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిసి నిలదీయండంతో దాడికి పాల్పడినట్లు తెలిపింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications