ఆస్పత్రి నిర్మాణంలో చిరంజీవి : ఆయనే పెద్ద దిక్కు - తలసాని: ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం కావాలి- చిరంజీవి..!!

సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కని తెలంగాణ మంత్రి తలసాని మరోసారి స్పష్టం చేసారు. అదే సమయంలో సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నదే చిరంజీవి ఆకాంక్షగా పేర్కొన్నారు. సినీ కార్మికోత్సవ వేడుకల్లో ఆయన కీలక అంశాలను వెల్లడించారు. సినీ కార్మికుల కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి... వారి కోసం పెద్ద ఆస్పత్రి కట్టాలని భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి సినీ కార్మికులదన్న ఆయన.. కరోనా సమయంలో వారు చాలా ఇబ్బందిపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

చలనచిత్ర పరిశ్రమకు అన్ని విధాలా సహకారమందిస్తున్నామని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కులం, మతం లేదు. సినీకార్మికులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తాం. ఇళ్లు లేని సినీ కార్మికులకు చిత్రపురిలో ఇళ్లు నిర్మంచి ఇస్తామని ప్రకటించారు. తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మన నటీనటులను పొరుగు రాష్ట్రాల వాళ్లు అనుసరిస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

Chiranjeevi beg decision on may day, megastar build hospital for cine workers

రాజకీయాలకతీతంగా సినీ కార్మికులు ఐక్యంగా ఉండాలని మెగాస్టార్‌ చిరంజీవి సూచించారు. బయటి కార్మికులకు, సినీ కార్మికులకు చాలా తేడా ఉంటుందని చిరంజీవి అన్నారు. సినీ కార్మికులకు నిర్ణీతమైన సమయం అంటూ ఉండదన్న ఆయన.. సెలవులు, పండుగలు అనేది లేకుండా కృషి చేస్తారని తెలిపారు. సినీ పరిశ్రమలో ఎవరి దారి వారిదే అవడం వల్ల ఇంతకు ముందు ఇలాంటి మేడేను జరుపుకోలేదన్నారు. ఈ రోజు కోసం తాను అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నానని చెప్పారు. తానూ కార్మికుడినేనని. ఎవరికి ఏ కష్టమొచ్చినా వారి వెనకే ఉంటానని హామీ ఇచ్చారు.

సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం బాధ్యతగా భావించానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు ఐక్యంగా ఉండాలని చిరంజీవి పిలుపునిచ్చారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కావాలని... తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిశ్రమకు ఎంతో భరోసా ఇచ్చారని చిరంజీవి చెప్పుకొచ్చారు. తన అభిమాన హీరో చిరంజీవి అని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. సినీ కార్మికులకు చిరంజీవి మంచి దారి చూపించాలన్నారు. తాను ఓటీటీ సినిమాలు తీస్తా, స్టూడియోలు కడతానని చెప్పారు. చిరంజీవితో కలిసి సినీకార్మికులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతానని మల్లారెడ్డి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+