KTR: కేటీఆర్ కు చేదు అనుభం.. గో బ్యాక్ అంటూ నినాదాలు..

మానవహక్కుల ఉద్యమకారుడు సాయి బాబాకు పౌర హక్కులు, ప్రజా సంఘాల నేతలు ఘన నివాళి అర్పించారు. ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా నివాళులు అర్పించేందుకు వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సాయి బాబా భౌతిక దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చారు. ఈ క్రమంలోనే పలువురు ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘాల నేతలు కేటీఆర్ ను అడ్డుకున్నారు. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. వారికి అక్కడున్న వారు సద్దిచెప్పే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ నినాదాలు ఆగలేదు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పౌరహక్కుల నేతలు, ఉద్యమకారులపై కేసులు పెట్టారని వారు ఆరోపంచారు. ఉపా వంటి కేసులు కూడా నమోదు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం, విమలక్క వంటి వారిపై కేసులు పెట్టలేదా అని నిలదీశారు. అయితే కేటీఆర్ సాయి బాబా మృతదేహానికి నివాళలు అర్పించి మౌనంగా వెళ్లిపోయారు. సోమవారం సాయిబాబా భౌతిక కాయాన్ని నిమ్స్ హాస్సిటల్ నుంచి అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ దగ్గరకు తీసుకొచ్చారు.

Civil rights leaders stopped KTR from paying respects to Sai Baba s body

గన్ పార్క్ లో సాయిబాబాకు పాటలతో ఉద్యమ నివాళులు అర్పించారు. సాయిబాబా పార్దివదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ కి డొనేట్ చేయనున్నారు. ఇప్పటికే ఆయన కళ్ళను LV ప్రసాద్ కంటి హాస్పిటల్ కు దానం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సాయి బాబా అక్టోబర్ 11న తుది శ్వాస విడిచారు. సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. సాయి బాబా 9 ఏళ్లపాటు జైలులోనే ఉన్నారు.

సుప్రీకోర్టు ఆదేశాలతో మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. సాయి బాబాను నిర్ధోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే అప్పటికే ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా తీవ్రంగా అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+