ఎన్ని వందల కోట్లైనా ఇస్తా.. రేవంత్ ను ఓడించండి: కొడంగల్ సభలో సీఎం కేసీఆర్!!
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు కొడంగల్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత తొమ్మిదేళ్లలో రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని పేర్కొన్న ఆయన, రేవంత్ రెడ్డి చరిత్ర అంతా భూకబ్జాల మయమని మండిపడ్డారు.
అభివృద్ధిని పక్కనపెట్టి సొంత ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలోను, కామారెడ్డి నియోజకవర్గంలోనూ ఓడించాలన్నారు . రేవంత్ రెడ్డి వీడ్ని తిట్టడం, వాడ్ని తిట్టడం తప్ప ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. రేవంత్ నోరు తెరిస్తే గబ్బు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్నాడని ఆ పార్టీ నేతలు చెప్పారని, రేవంత్ రెడ్డి కారణంగా గాంధీభవన్ పై రాళ్లు కూడా పడ్డాయని కెసిఆర్ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 50 లక్షలు ఇచ్చి ఎమ్మెల్యే ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని, రేవంత్ రెడ్డి దొరికిన దొంగ అంటూ మండిపడ్డారు. జైలుకు వెళ్లినా, చిప్పకూడు తిన్నా రేవంత్ రెడ్డికి సిగ్గు రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో 15 మంది మోపయ్యారని, ఆ పార్టీ గెలిచేది లేదని, వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేది లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు మించి రావని కెసిఆర్ తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఓట్లు వేయొద్దని, నరేందర్ రెడ్డి కి ప్రమోషన్ తప్పకుండా వస్తుంది కాబట్టి అతనికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలలో ఉండడం దురదృష్టకరమని కెసిఆర్ పేర్కొన్నారు.
ఎన్ని వందల కోట్లు కావాలన్నా ఇస్తానని, డబల్ రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఏది కావాలన్నా ఇస్తానని పేర్కొన్న కెసిఆర్ తానే వచ్చి ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొడంగల్ ను కేటీఆర్ దత్తత తీసుకున్నారని, నరేందర్ రెడ్డి కూడా అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి నీతి లేదని అటువంటి వాడిని ఓడించాలని కెసిఆర్ అన్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications