హరీశ్‌కు సీఎం కేసీఆర్ పిలుపు: మునుగోడు బాధ్యత..?, కేటీఆర్‌ను కాదని, కారణం ఇదే
మునుగోడు బై పోల్‌లో ప్రధాన పార్టీలు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఆ మేరకు గులాబీ దళపతి వ్యుహరచన చేస్తున్నారు. హుజురాబాద్ ఓటమితో మరోసారి అలాంటి తప్పు జరగకూడదని అనుకుంటున్నారు. అందుకే మంత్రి హరీష్‌రావుకు మునుగోడు బాధ్యతలు అప్పగించారు.

హరీశ్‌కు బాధ్యతల వెనక
మునుగోడులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారు. హరీష్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ ఎత్తుగడలను ఈటల రాజేందర్ పసిగట్టే అవకాశం ఉంది. అందుకే మంత్రి కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాధ్యతలను హరీష్‌రావుకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. ప్రగతి భవన్ రావాలని హరీష్‌రావుకు కేసీఆర్ నుంచి పిలుపువచ్చింది.

అలా జరగొద్దు..
దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠాలు.. మునుగోడులో తావివ్వొద్దని నిర్ణయించింది. మునుగోడు ఉపఎన్నికలో ఓటరు కేంద్రంగా సైలెంట్‌గా ప్రచారం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు మునుగోడు ఉపఎన్నిక బాధ్యతలు పూర్తిగా ఇవ్వాలని, ప్రతీ ఎంపీటీసీ పరిధిలో ఒక కీలకనేతను బాధ్యుడిని చేయాలని నిర్ణయించారు. తాజాగా ఆ నిర్ణయంలో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలుస్తోంది.

మీటర్లకు మోటార్లు..
నియోజకవర్గంలో రైతులు బీజేపీ అంటేనే భయపడేలా కార్యాచరణ రూపొందించారు. బీజేపీకి ఓటు వేస్తే మోటరుకు మీటరు తప్పదంటూ ప్రచారానికి రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇలా కలిసి వచ్చిన ప్రతీ ఒక్క అంశాన్ని వదులుకోవడం లేదు. అందుకే తెరపైకి హరీశ్‌ను దించారు.

బై పోల్
ఓ వైపు జాతీయ పార్టీ అంటూనే.. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ఓ ఐదారుసార్లు చుట్టి వచ్చారు. ప్రజల అవసరాలపై ఫోకస్ చేశారు. వాటిని తీరుస్తామని చెబుతున్నారు.అన్నింటికీ కేంద్రమే కారణం అంటున్నారు. ప్రధానంగా వ్యవసాయ మీటర్లకు మోటార్లు అంటూ చెబుతున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications