India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాకు మరో మణిహారం: పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. ప్రత్యేకతలివే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. దీంతో తెలంగాణాకు మరో మణిహారం వచ్చి చేరింది. అంతకుముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్ కు పోలీసులు ద్విచక్ర వాహనాలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు సీఎం కేసీఆర్ కు గౌరవ వందనం సమర్పించారు. ఆపై తెలంగాణ సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేసి, కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు.

కేసీఆర్‌పై వైఎస్ షర్మిల కొత్త యుద్ధం: కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలో గవర్నర్ వద్దకు పంచాయితీ!!కేసీఆర్‌పై వైఎస్ షర్మిల కొత్త యుద్ధం: కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలో గవర్నర్ వద్దకు పంచాయితీ!!

తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ప్రారంభోత్సవం సందర్భంగా పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నేడు ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవ నేపథ్యంలో సిపి సివి ఆనంద్ దంపతులు తమ చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణా సీఎం కేసీఆర్ చే ప్రారంభించబడిన ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 ఒకేచోట నుండి నగరమంతా వీక్షించేలా .. అత్యాధునిక సాంకేతికత

ఒకేచోట నుండి నగరమంతా వీక్షించేలా .. అత్యాధునిక సాంకేతికత


ఇక తెలంగాణ రాష్ట్ర పోలీసుల కోసం నేడు ప్రారంభించిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతల విషయానికి వస్తే అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ ఒకే చోట నుంచి నగరమంతా వీక్షించేలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేటెడ్ చేస్తూ ఆరు వందల కోట్ల రూపాయలతో 18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఏడు ఎకరాలు, 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరిగింది. నవంబర్ 2015లో సెంటర్ ఫౌండేషన్‌ వేయగా షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.

 అన్ని విభాగాలు ఒకే గొడుగు క్రిందకు

అన్ని విభాగాలు ఒకే గొడుగు క్రిందకు


ఎల్ అండ్ టీ, ఇన్ఫోటెక్ మరియు ఇతర బహుళజాతి సంస్థలు సాంకేతిక సలహాలు మరియు డిజిటల్ సపోర్ట్ ను అందించాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పోలీసు బలగాల ఆధునికీకరణలో భాగంగా ఐసీసీసీని రూపొందించారు. నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సిసిఎస్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ ఇలా అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకు వస్తున్నారు. అంతే కాదు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానాన్ని కూడా అమలు చేయనున్నారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఐదు టవర్లు .. నిర్మాణం ఇలా

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఐదు టవర్లు .. నిర్మాణం ఇలా


తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఐదు టవర్లు ఉన్నాయి. టవర్లు A మరియు B వరుసగా 15 మరియు 20 అంతస్తులను కలిగి ఉంటాయి. మీడియా మరియు శిక్షణా కేంద్రం మరియు 480 సీట్లతో మూడు- థియేటర్ టవర్స్ C మరియు Dలో ఉన్నాయి. కమాండ్, కంట్రోల్ మరియు డేటా సెంటర్ టవర్-E యొక్క మూడు అంతస్తులలో ఉన్నాయి. మొత్తం నిర్మాణం "గ్రీన్ బిల్డింగ్" గా నిర్మించబడింది. 4.26 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ప్రాంతం మరియు 600 ఫోర్ వీలర్స్ మరియు 350 ద్విచక్ర వాహనాల కోసం అదనపు పార్కింగ్ సౌకర్యం ఈ భవనానికి ఉంది. ఇక టికెట్‌తో, సందర్శకులు 14వ మరియు 15వ ఫ్లోర్ లలో తెలంగాణా పోలీస్ మ్యూజియాన్ని చూడవచ్చు. సోలార్ సిస్టమ్ ద్వారా 0.5 మెగావాట్లను (MW) ఉత్పత్తి చేస్తారు. భవనంలో రీసైకిల్ చేయబడిన వస్తువులను వినియోగిస్తారు.

English summary
Telangana CM KCR inaugurated the Telangana State Police Integrated Command and Control Center. ICCC has been constructed with advanced technology to view the city from one place and all police departments to work at one place
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X