తెలంగాణా సీఎం కేసీఆర్ మరో కొత్తపథకం: వారికోసం న్యూట్రిషన్ కిట్; ఈ జిల్లాలలోనే అమలు!!
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కిట్ తరహాలో మరో అద్భుతమైన పథకానికి తెలంగాణా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ సంవత్సరం కెసిఆర్ కిట్ తరహాలో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అందించబోతున్నామని ప్రకటించారు. సాక్షాత్తు ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

న్యూట్రిషన్ కిట్ ద్వారా రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణీలకు లబ్ది
ఇప్పటికే కెసిఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచామని పేర్కొన్న హరీష్ రావు, న్యూట్రిషన్ కిట్ ద్వారా రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణీలకు కావలసిన న్యూట్రిషన్ అందించి మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని హరీష్ రావు వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కెసిఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి హరీష్ రావు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని గురించి వెల్లడించారు.

కేసీఆర్ కిట్ ద్వారా ఆసుపత్రులలో 54 శాతం పెరిగిన ప్రసవాలు
కెసిఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని, గర్భిణీల మరణాల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. 2017 జూన్ 2 నుండి ఇప్పటి వరకు ఈ పథకం కింద 13,29,951 మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఈ పథకం అమలు కోసం 1387.19 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కెసిఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో 54 శాతం ప్రసవాలు పెరిగాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.

9 జిల్లాలలో న్యూట్రిషన్ కిట్ పథకం
గతంలో ప్రసవాలకు వచ్చిన తల్లుల మరణాలు ప్రతి లక్షకు 94 ఉండేవని, ప్రస్తుతం కెసిఆర్ కిట్ అమలవుతున్న సమయంలో మరణాలు 63 తగ్గాయని, శిశు మరణాలను కూడా తగ్గించుకున్నామని మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో త్వరలో న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు అవుతుందని పేర్కొన్న మంత్రి హరీష్ రావు న్యూట్రిషన్ కిట్ పథకం ద్వారా రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు పోషకాలను అందిస్తామని వెల్లడించారు.
Recommended Video

న్యూట్రిషన్ కిట్ అమలయ్యే జిల్లాలు ఇవే
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, కొమరం భీమ్ ఆదిలాబాద్ జిల్లాలలో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి కృషి చేస్తుందని, మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పిన మంత్రి హరీష్ రావు కొత్తగా 23 మాతా శిశు సంక్షేమ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications