Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ కేసీఆర్ కీలక నిర్ణయం- సరిగ్గా 10 రోజుల్లో: పండగలా..!!

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థిితుల్లో అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇందులో భాగంగా- ఈ నెల 16వ తేదీన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్ రన్‌ను ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇన్‌టేక్ స్విచ్ ఆన్ చేసి ఈ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లో భాగంగా కృష్ణా జలాలను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లపూర్ రిజర్వాయర్‌లోకి ఈ నీటిని ఎత్తిపోస్తారు.

CM KCR will start wet run of Palamur Rangareddy Lift Irrigation Scheme on Sept 16

అనంతరం- కృష్ణమ్మకు కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా ప్రజలను సమీకరించబోతోన్నారు బీఆర్ఎస్ నాయకులు. ప్రగతి నివేదన సభను విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టారు.

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ నేడు సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జల వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16వ తేదీన ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

17వ తేదీన ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలతో కూడిన కలశాలతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు బీఆర్ఎస్ నాయకులు. కృష్ణా జలాలతో కూడిన కలశాలను ప్రతీ గ్రామంలోని ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకించనున్నారు.

CM KCR will start wet run of Palamur Rangareddy Lift Irrigation Scheme on Sept 16

ఎన్నో అడ్డంకులను అధిగమించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకోగలిగామని, అందుకే భక్తిపూరకంగా ఆయా గ్రామాల్లోని ఆలయాల మూల విరాట్టులు, ఉత్సవ విగ్రహాలకు కృష్ణా జలాలతో అభిషేకం చేయాలని, మొక్కులు చెల్లించుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 17వ తేదీని ఒక పండగలా జరుపుకొందామని సూచించారు.

దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా పండగ కోలాహలం నెలకొనాలని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో మొక్కులు మొక్కుకున్నారని, దేవుడి ఆశీస్సులతో దీన్ని పూర్తి చేసుకున్నామని వ్యాఖ్యానించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కల సాకారం కావడానికి ఇంజినీర్లు ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+