ఎన్నికల వేళ రేవంత్ కీలక నిర్ణయం - నేరుగా రంగంలోకి..!!

తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్..పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అటు బీజేపీ, బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించాలని భావిస్తోంది. త్రిముఖ పోరులో తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. బీఆర్ఎస్ బలహీనపడిందని..తామే ఎక్కువ సీట్లు గెలుస్తామని బీజేపీ అంచనా వేస్తోంది.

రేవంత్ ప్రచారం
తెలంగాణ ముఖ్యమంత్రిగా..కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ కు పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. మెజార్టీ సీట్లు సాధించి పార్టీ నాయకత్వం తనకు అప్పగించిన టాస్క్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. అభ్యర్దుల ఎంపిక విషయంలోనూ రేవంత్ ఛాయిస్ కే పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మరో మూడు స్థానాలకు కాంగ్రెస్ తమ అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్దలను ఈ రోజు లేదా రేపు ప్రకటిస్తారని చెబుతున్నారు.

CM Revanth election campaign to begin on 19th Schedule announces

రేవంత్ బాధ్యతలు
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పార్టీ నాయకత్వం వస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే రేవంత్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది.రేపు (19వ తేదీ) నుంచి రేవంత్ నియోజకవర్గాల వారీగా ప్రచార షెడ్యూల్ ఫిక్స్ అయింది. రేపు సీఎం రేవంత్ మహబూబ్‌నగర్‌లో వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు హాజరు కానున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు రేవంత్ హాజరు కానున్నారు. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు రేవంత్ హాజరవుతారు. 20న సాయంత్రం కర్ణాటక ప్రచారంలో పాల్గొనేందుకు రేవంత్ వెళ్లనున్నారు.

CM Revanth election campaign to begin on 19th Schedule announces

హోరా హోరీ సమరం
అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం చేయనున్నారు. 21న భువనగిరిలో చామల కిరణకుమార్‌ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ హాజరయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసారు. 22న ఉదయం ఆదిలాబాద్‌ సభలో పాల్గొననున్న సీఎం...23న నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ సభకు రేవంత్ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అటు కేసీఆర్ తన ప్రచార సభల్లో రేవంత్ ను టార్గెట్ చేస్తుండటంతో..రేవంత్ ఎన్నికల ప్రసంగాల పై ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+