ఢిల్లీలో రేవంత్ - రేపు మంత్రివర్గ విస్తరణ, లిస్టులో..!?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇదే సమయంలో ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎల్లుండితో ఆషాడ మాసం మొదలు కాబోతున్నది. దీంతో రేపు ఒక్కరోజే అవకాశం ఉండటంతో ఈ అంశాలపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంటే రేపు మంత్రివర్గ విస్తరణ ఉండనుందని సమాచారం.

మంత్రివర్గ విస్తరణ
తెలంగాణలో రేపు (గురువారం) మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. మఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. ఈ రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే గత ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్‌, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవులపై కాంగ్రెస్‌ అగ్రనేతలతో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే 11మంది మంత్రులుగా ఉన్నారు. మరో ఏడెనిమిది మందికి చోటు కల్పించేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ నియామకం పైన తుది నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి.

CM Revanth gearing up for a significant cabinet expansion expected to take place on 4th July

హైకమాండ్ ఆమోదంతొ
ఇటీవల 5రోజులపాటు ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నేతలు, పార్టీ పెద్దలతో విస్తృతంగా చర్చించారు. పలు సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి రెండు, వెలమల ఒకటి, బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ చీఫ్, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.

కొత్తగా ఛాన్స్ దక్కేదెవరికి
ఎల్లుండితో ఆషాడ మాసం మొదలు కాబోతున్నది. దీంతో రేపు ఒక్కరోజే అవకాశం ఉండటంతో ఈ అంశాలపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంటే రేపు ప్రమాణ స్వీకారం పూర్తి చేయించాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ రేసులో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు మంత్రి, నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్‌రావు సహా పలువురి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. దీంతో., తుది జాబితాలో ఎవరికి అవకాశం దక్కుతుందని ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+