16మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్.. ఎందుకంటే!

తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల పర్వం ముగిసింది. 66% పంచాయతీలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ దూకుడును ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందడంతో సంతోషంలో ఉన్నప్పటికీ, గెలవని స్థానాల పైన కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం నిర్వహించింది.కాంగ్రెస్ కు పట్టు ఉన్న స్థానాలను ఎక్కడెక్కడ కోల్పోయారు? ఏం జరిగింది అన్న దానిపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.

వారిపై సీఎం రేవంత్ అసహనం
నేడు టెలికాన్ఫరెన్స్ లో 16 మంది ఎమ్మెల్యేల పైన సీరియస్ అయ్యారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.

cm-revanth-is-serious-about-16-mlas-and-constituencies-incharges-over-gram-panchayat-elections

16మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు రేవంత్ ఆదేశం
ఈ టెలి కాన్ఫరెన్స్ లో రెబెల్స్ ను సమన్వయం చేయలేని 16మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలపైన రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెబల్స్ తో సమన్వయలోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా పార్టీకి తీరని నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు తమ వైఖరి మార్చుకుని పార్టీ నియమ,నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

పద్ధతి మార్చుకోవాలని హితవు
తమకు పట్టున్న కొన్ని ప్రాంతాలలో స్థానాలు కోల్పోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ అందుకు గల కారణాల పైన చర్చించారు. బాధ్యులైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లకు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సమన్వయంతో పని చేసినట్లయితే మరిన్ని స్థానాలు తమ ఖాతాలో పడేవని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలు ఇలా
ఇదిలా ఉంటే రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామపంచాయతీలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 12,702 పంచాయతీలకు కాంగ్రెస్ 7,527 చోట్ల, కాంగ్రెస్ రెబల్స్ 808 చోట్ల గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ రెబల్స్ కలిపి 8,335 పంచాయతీలు అంటే 66% ఫలితాలను సాధించారు. 3511 బీఆర్ఎస్ స్థానాలను, 710 బిజెపి స్థానాలను దక్కించుకున్నాయి. 146 గ్రామ పంచాయతీలలో సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు గెలిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+