Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీనాక్షీ తో రేవంత్ కీలక చర్చలు, వారికి చెక్ - ముహూర్తం ఫిక్స్..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో సీఎం రేవంత్ దూకుడు పెంచారు. రాజకీయంగా కీలక నిర్ణయాల కు సిద్దం అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణ..టీపీసీసీ కార్యవర్గం పైన వచ్చే వారం ఏఐసీసీ అధి నాయకత్వం వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల నిర్వహణ పైనా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ తో సీఎం రేవంత్ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ తో కీలక అంశాల పైన చర్చ జరిగింది. గత పది రోజులుగా పార్టీ నేతలతో మీనాక్షి వరుస సమీక్షలు నిర్వ హించారు. పార్టీ నేతల అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ చర్చించారు. పార్లమెంట్ నియోజక వర్గాలకు సంబంధించి.. అలాగే అసెంబ్లీకి సంబంధించి నేతలతో ఉమ్మడి జిల్లాలకు కొంతమందిని అబ్జర్వర్స్‌ను నియమించారు. వారందరితో వరుసగా పది రోజులపాటు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ విషయాల పైన ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోం ది. ఈ సమీక్షల వేళ పార్టీ కేడర్ నుంచి వచ్చిన ఫిర్యాదులు.. ప్రస్తావించిన అంశాల పైన చర్చిం చి.. రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

cm-revanth-key-discussions-with-meenakshi-natrajan-over-local-body-elections

పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరుకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాలు, నియోజకవర్గాల్లో నేతలు సోషల్ మీడియాలో బలహీనంగా ఉన్ నారని, చాలా మందికి సోషల్ మీడియాపై అవగాహన లేదని గుర్తించినట్లు మీనాక్షీ వివరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి వివరాలు తెలియవని, వాటిపై వారికి అవగాహన లేకపోవవడంతో జనాలకు వివరించలేకపోతున్నారని మీనాక్షికి ఫిర్యాదులు అందాయి. ఈ విషయాలను సీరియస్ గా పరిగణించి.. అవసరమైన కార్యాచరణ ఖరారు చేయాలని ఇరువురు నేతలు డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల పాత నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని దీనికి చెక్ పెట్టేలా నిర్ణయాలు ఉండాలని నిర్ణయించారు. త్వరలోనే పార్టీ నియోజకవర్గ నేతల భేటీలు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+