ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ: ఒకే రోజులో ప్రధాని మోదీ, రాహుల్, ప్రియాంకతో సమావేశం!
CM Revanth Reddy Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని నేడు(డిసెంబర్ 3) ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకం భేటీ అయ్యారు.
ప్రధాని మోదీతో భేటీ.. 'తెలంగాణ రైజింగ్ 2047'కి ఆహ్వానం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఆయన ప్రధానికి అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం ప్రధానికి వివరించారు.

నీతి ఆయోగ్ సలహాలు, సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేధో మథనంతో తయారు చేసిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు సీఎం ప్రధానికి వివరించారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశం
అంతకుముందు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు.హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి సీఎం ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు వివరించి, ఆహ్వాన పత్రికను అందించారు.

-
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
టీ తోటల్లో ప్రధాని మోదీ- అట్నుంచి నరుక్కొస్తున్నారు మరి -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications