బీఆర్ఎస్ ప్రారంభించిన భారీ ప్రాజెక్ట్‌కు బ్రేకులు వేసిన రేవంత్: నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ

భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఓ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపి వేశారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియనూ హోల్డ్ లో పెట్టారు. ఈ మేరకు మున్సిపల్ మంత్రిత్వ శాఖకు ఆదేశాలను జారీ చేశారు. దీనిపై కొత్త ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.

అదే- శంషాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించ తలపెట్టిన భారీ ప్రాజెక్ట్ ఇది. అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా దీన్ని నిర్మించాలని ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. టెండర్ల ప్రక్రియను సైతం చేపట్టింది. దీనికి అయ్యే నిర్మాణ వ్యయం 6,250 కోట్ల రూపాయలు.

CM Revanth Reddy directs to put Shamshabad Airport Metro plan and its tender on hold

ఐటీ కారిడార్‌‌ను శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానిస్తూ దీన్ని నిర్మించాలనేది బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్దేశం. అధికార మార్పిడి తరువాత ఈ ప్రాజెక్ట్‌కు రెడ్ సిగ్నల్ లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఇందులో పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్ట్ పనులు, టెండర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. నిర్మాణ ఖర్చు తక్కువ అయ్యేలా ప్రత్యామ్నాయ రూట్‌పై కొత్త ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు. అవుటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉన్నందున అదే మార్గంలో మెట్రో రైలు సర్వీస్ అవసరం లేదని తేల్చి చెప్పారు.

దీనికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్‌-చాంద్రాయణగుట్ట-ఫలక్‌నుమా మీదుగా ఎయిర్‌పోర్టు వరకు అలైన్‌మెంట్‌ రూపొందించాలని ఆదేశించారు. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి లేదా, చాంద్రాయణగుట్ట, బార్కాస్‌, పహాడీ షరీఫ్‌, శ్రీశైలం రోడ్ మార్గంలో మెట్రో రైలును నడిపించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.

ఈ రెండింట్లో ఏ రూట్‌లో ఖర్చు తక్కువ అవుతుందో.. దాన్నే ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల అటు పాతబస్తీ ప్రజలకూ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినట్టవుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలోని కందుకూర్ వద్ద ప్రతిపాదించిన ఫార్మా సిటీని రద్దు చేయాలని, దీనిస్థానంలో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌‌ను నిర్మించాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+