Crop Loan Waiver: భద్రాద్రి రాముడి సాక్షిగా రుణ మాఫీపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..!
సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణ మాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి రాముడి సాక్షిగా రైతులకు రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే రుణ మాఫీ పై ప్రతిపక్షలు దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ అన్నారు. పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి..రైతుల రుణం తీర్చుకుంటానని తెలిపారు. రేవంత్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని అన్నారు. ఈ జిల్లాలకు పోరాటాల గడ్డగా పేరొందని చెప్పారు. ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చామని స్పష్టం చేశారు. మే 9 వరకు రైతులందరికీ రైతుబంధు నిధులు జమ చేస్తామని.. అప్పటివరకు రైతుబంధు పడని ఒక్క రైతు ఉన్నా.. తాను అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని కేసీఆర్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ చివరకి బీజేపీలోనే చేరుతారని జోస్యం చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. కేసీఆర్ అంటేనే కాలకూట విషమన్నారు.
కేసీఆర్ ను కాంగ్రెస్ దగ్గరకు రానివ్వదన్నారు. కేసీఆర్ పని అయిపోయింది.. బీఆర్ఎస్ కాటికి పోవాల్సిందేనని విమర్శించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications