తెలంగాణకు రేవంత్ గుడ్ న్యూస్: నెలాఖరుకల్లా శంకుస్థాపన

Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి శంకుస్థాపనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ అసుపత్రి ద్వారా పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

గోషామహల్ పోలీస్ స్టేడియం స్థలంలో ఈ ఆసుపత్రి నిర్మితం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ ఛొంగ్తు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

CM Revanth Reddy review on new Osmania Hospital in Hyderabad

ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేయడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గోషామహల్‌ పోలీస్ స్టేడియంలో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్‌లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ మ్యాప్‌లల్లో రేవంత్ రెడ్డి పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని చెప్పారు. ముఖ్యంగా రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు.

CM Revanth Reddy review on new Osmania Hospital in Hyderabad

భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలని చెప్పారు. అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేద తీరడానికి వీలుగా గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలని అన్నారు.

కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని, ఈ నెలాఖరులో శంకుస్థాపన చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+