Runa Mafi: రుణ మాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఆ తేదీలోపు మాఫీ చేస్తామని స్పష్టం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు పలు హామీలు ఇచ్చింది. ఇందులో రైతు భరోసా కింద్ ఏడాదికి రూ.15 వేలు అందించడం. వరికి బోనస్ గా రూ.500 చెల్లించడం. అలాగే రూ.2 లక్షల రుణ మాఫీ చేయడం. అయితే కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇందులో ఏ ఒక్కటి అమలు చేయాలేదు. ఈ హామీలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి వరికి రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించారు.
అంతే కాకుండా రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్ట్ 15 లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.2 లక్షల రుణ మాఫీ ఏక మొత్తంలో చేయనున్నారు. అయితే ఇంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు. దీంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది. కార్పొరేషన్ కు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొచ్చి రైతు రుణ మాఫీ చేయాలని యోచిస్తోంది. ఇందు కోసం బ్యాంకర్లతో చర్చలు జరుపుతోంది.

బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పులకు ప్రభుత్వం నెలనెలా తిరిగి చెల్లించనుంది. ఇందుకు కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ నుంచే వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఉపయోగించనుంది. రాష్ట్రంలో రైతు రుణాలు తీసుకున్న దాదాపు 30 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రూ.30 రుణం తీసుకున్న వారు ఉన్నారు. రూ.2 లక్షలు రుణం తీసుకున్న వారు ఉన్నారు. అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న వారు ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రూ.2 లక్షల వరకే మాఫీ చేయనుంది.
రుణ మాఫీ కోసం ప్రభుత్వానికి రూ.32 కోట్లు అవసరం అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణాలు రూపంలో తీసుకోవాలని భావిస్తోంది. అందుకే కార్పొరేషన్ ఏర్పాటు దిశగా సన్నాహాలు చేస్తోంది. రైతు రుణ మాఫీ అనేది ఎప్పటి నుంచే పనికొచ్చే హామీగా ఉంది. బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు రుణ మాఫీ చేసింది. అయితే ఈసారి రుణ మాఫీ హామీ ఇవ్వకపోవడంతో ఓటమి పాలయింది.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications