రేవంత్ మంత్రివర్గ విస్తరణ - కోదండరామ్ కు ఛాన్స్, లిస్టులో..!!
మంత్రివర్గ విస్తరణ దిశగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఈ సాయంత్రం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ నాయకత్వంతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ..ఎంపీ అభ్యర్దుల పైన రేవంత్ హైకమాండ్ చర్చించనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో మంత్రివర్గంతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు. లోక్ సభ అభ్యర్దుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇక, మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేదెవరనే చర్చ మొదలైంది.
రేవంత్ ఢిల్లీ టూర్: మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పైన ప్రచారం మొదలైంది. ఇటు రేవంత్ అలర్ట్ అయ్యారు. పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ కు ముందుగానే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇందు కోసం పార్టీ హైకమాండ్ తో చర్చించి అనుమతి తీసుకొనేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ తన మంత్రివర్గంలో కొత్త వారి జాబితా సిద్దం చేసినట్లు సమాచారం. ఈ జాబితాకు పార్టీ అధినాయకత్వం ఆమోద ముద్ర వేస్తే వెంటనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.
హైకమాండ్ ఆమోదం: మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కోదండరామ్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. న్యాయపరమైన అంశాలతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా..ఆరు నెలల్లోగా చట్ట సభలకు ఎన్నికయ్యే అవకాశం ఉంది.
దీంతో, మంత్రిపదవికి ఆయన పేరు ఖాయం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక, రేవంత్ మంత్రివర్గంలో ఇప్పటి వరకు అవకాశం దక్కని అదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ కు ఈ సారి విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసారు.
ఛాన్స్ దక్కేదెవరికి: రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకం తో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావ్ కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్ పోటీలో ఉన్నారు. కీలకమైన హోం శాఖ ఎవరికి అప్పగిస్తారనేది తేలాల్సి ఉంది. సాగుతోంది.
దీంతో..కేబినెట్ విస్తరణ - శాఖల ఖరారు పైన ఆసక్తి కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయటం ద్వారా ఎన్నికల్లో మరింత జోష్ తో కేడర్ పని చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో, రేవంత్ ఢిల్లీ పర్యటన పైన ఆసక్తి కొనసాగుతోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications