అల్లు అర్జున్ అరెస్ట్‌పై దావోస్ వేదికగా స్పందించిన సీఎం రేవంత్
పుష్ప-2 విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్రగాయాలు కావడంతో పోలీసులు సినీనటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనేగాక, దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాజాగా, ఈ అంశంపై దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓ ఇంగ్లీష్ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఇప్పటికే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీ రేవంత్ స్పందించిన విషయం తెలిసిందే.

తాజాగా, ఇంగ్లీష్ మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రేవంత్ సమాధానమిచ్చారు.
రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే.. పోలీసులు నిరాకరించారు. అయినా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలిరావడంతో ఆయనతో వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారు. ఆ తొక్కిసలాటలో ఒకర మహిళ చనిపోయారు. ఒక మనిషి చనిపోవడమన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. కానీ, ఆమె చనిపోతే.. 10-12 రోజులు బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ పట్టించుకోలేదు. ఈ క్రమంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడు ఇప్పుడు కిమ్స్ ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. కోటి ఆర్థిక సాయం చేయగా.. దర్శకుడు సుకుమార్, పుష్ప2 నిర్మాతలు కలిసి మరో కోటి సాయం అందించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications