ఆదివాసీలపై సీఎం రేవంత్ వరాల జల్లు

తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను ప్రస్తావిస్తూ వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

CM Revanth Reddy reviews issues of tribals gives key instructions

అలాగే పలు అంశాలపై అధికారులకు సూచనలిచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ ఆదేశించారు.

ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి
చర్యలు చేపడుతున్నామన్నారు సీఎం రేవంత్.

ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం. విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

CM Revanth Reddy reviews issues of tribals gives key instructions

ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక తయారు అందించాలి. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆదివాసీ సంఘాల నేతలు ఆత్రం సక్కు, గోడం గణేష్, మేస్రం మనోహర్, మర్స్ కోల తిరుపతి, టేకం భాస్కర్, జుగున్‌క దేవు సర్మేది, కొడప హన్నుపటేల్, ఆద అమృతరావు, మేస్రం మోతీరాం, ఆత్రం సుగుణ, ప్రొ. గుమ్మడి అనురాధ, ప్రొ. అప్క నాగేశ్వర రావు, ప్రొ. రేగ రాజేందర్, ప్రొ. సిదం కిశోర్, సిదం జగ్ను, ఆత్రం లక్ష్మణ్, సోయం భీంరావు, సిదం అర్జు, బుర్సా పోచయ్య, మేస్రం గంగారాంతో పాటు పలువురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+