సూర్య ‘వీడొక్కడే’ తలపించేలా కడుపులో కొకైన్ క్యాప్సుల్స్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టేశారిలా

హైదరాబాద్: డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మాదక ద్రవ్యాల వ్యాపారులు మాత్రం కొత్తదారులు వెతుకుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి మనదేశంలోని నగరాలకు అక్రమంగా తీసుకొస్తున్నారు. ఆ దొంగలను పట్టుకునేందుకు విమానాశ్రయాల్లోని అధికారులు కూడా అంతే ప్రమత్తంగా వ్యవహరిస్తూ వారికి చెక్ పెడుతున్నారు.

సూర్య ‘వీడొక్కడే' తరహాలో కడుపులో క్యాప్సుల్స్..

సూర్య ‘వీడొక్కడే' తరహాలో కడుపులో క్యాప్సుల్స్..

తమిళ హీరో సూర్య నటించిన వీడొక్కడే సినిమాలో తరహాలోనే శంషాబాద్ విమానాశ్రయంలో ఓ దుండగుడు డ్రగ్స్‌ను తరలించే ప్రయత్నం చేసి డీఆర్ఐ అధికారులకు చిక్కాడు. ఏప్రిల్ 21న కడుపులో కొకైన్ క్యాప్సుల్స్ తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ విమానాశ్రంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి మొత్తంగా 79 కొకైన్ క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఆఫ్రికా నుంచి వచ్చి శంషాబాద్‌లో పట్టుబడ్డాడు..

ఆఫ్రికా నుంచి వచ్చి శంషాబాద్‌లో పట్టుబడ్డాడు..

ఆ వివరాల్లోకి వెళితే.. టాంజానియాకు చెందిన సాలె ఏప్రిల్ 21న సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాడు. విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు నిందితుడిని తనిఖీ చేయగా.. అతని వద్ద ఉన్న 22 కొకైన్ క్యాప్సుల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక, నిందితుడు తన కడుపులో కూడా కొకైన్ క్యాప్సుల్స్ తీసుకొచ్చినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

వ్యక్తి కడుపులోంచి 58 కొకైన్ క్యాప్సుల్స్.. రూ. 11.57 కోట్ల కొకైన్ స్వాధీనం

వ్యక్తి కడుపులోంచి 58 కొకైన్ క్యాప్సుల్స్.. రూ. 11.57 కోట్ల కొకైన్ స్వాధీనం

ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఐదు రోజుల వ్యవధిలో మరో 58 కొకైన్ క్యాప్సుల్స్‌ను అతని కడుపులోంచి బయటకు తీశారు. మొత్తంగా 1.157 కిలోల కొకైకన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీని విలువ సుమారు 11.57 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. కాగా, కడుపులో డ్రగ్స్ దాచుకోవడంతో నిందితుడి ఆరోగ్య పరిస్థితి కొంత దెబ్బతిన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో డ్రగ్స్ తరలిస్తూ నిందితులు పట్టుపడుతున్న కేసులు పెరుగుతుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+