Weather Report: తెలంగాణలో పెరిగిన చలి.. గజగజ వణుకుతున్న జనం..

తెలంగాణలో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. మొన్నటి వరకు వర్షాలతో చలి తక్కువగా ఉన్నా.. తాజాగా పెరుగుతోంది. నైట్ కాకుండా డే టైమ్ లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. వచ్చే మూడు రోజుల్లో కూడా రాష్ట్రంలో చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చలి పెరగడంతో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ చలి తీవ్రత ఎక్కువగా ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతోన్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో కనిష్ఠంగా 12.3 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు అయింది. నిర్మల్ జిల్లా పెంబిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9, పెద్దపల్లి జిల్లా మంథనిలో 13.9 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదయింది.

Cold is gradually increasing in Telangana

సోమవారం కూడా చలి తీవ్రత కొనసాగుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా డిసెంబర్, జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇటు దక్షిణ తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రానున్న రెండు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు పేర్కొంచున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తోంది.

అటు ఏపీలో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. రెండురోజులపాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఏపీ కంటే తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న చలి నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+